గుంటూరు : పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పలువురు అధికారుల తీరుపై
అనుమానాలు ఉన్నాయని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటే అని
విమర్శించారు. కాగా సజ్జల అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ
ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబుది దబాయింపే. చంద్రబాబు హయాంలో వ్యవస్థలను
తొక్కిపెట్టారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది. అర్జెంటుగా
అధికారంలోకి వచ్చేయాలన్నది చంద్రబాబు ఆశ. చంద్రబాబు ఆశలు కలలుగానే మిగులుతాయి.
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ
ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు జరిగాయి. పలువురు అధికారుల తీరుపై
అనుమానాలున్నాయి. ఒక్క బండిల్లోనే 6 ఓట్లు తేడాగా కనిపించాయి. అన్ని
బండిల్స్లోనూ గమనిస్తే అసలు విషయం తెలుస్తుంది. కౌంటింగ్ సమయంలో అధికారులు
ఎలా వ్యవహరించారో చూశాం. వైఎస్సార్సీపీ ఓట్లను టీడీపీ ఓట్లలో కలిపేశారు.
దీనిపై కౌంటింగ్ అయిపోయాక అడగాలని ఆర్వో అన్నారు. రీకౌంటింగ్ చేయాలని కోరడం
అభ్యర్థి హక్కు అని అన్నారు. అలాగే, తెలుగుదేశం పార్టీ వైరస్ లాంటిది. అన్ని
వ్యవస్థలను ఆ వైరస్ పాడు చేస్తుంది. మేం అధికారులపై ఒత్తిడి తెస్తే రిజల్ట్
ఇలా ఎందుకు వస్తుంది. మాపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ ఎప్పుడూ ధర్మయుద్ధమే చేస్తుంది అని స్పష్టం చేశారు.