దిల్రాజు నిరిస్తున్న ద్విభాషా చిత్రం ‘వారసుడు’ తెలుగు, తమిళ చిత్ర
పరిశ్రమల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. అవసరమైతే తమిళనాట తెలుగు చిత్రాల
విడుదలను అడ్డుకోవడానికి కూడా తాము వెనుకాడబోమని తమిళ దర్శక నిర్మాతలు
హెచ్చరిస్తున్నారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో తెలుగు స్ర్టెయిట్
చిత్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలనీ, మిగిలిన థియేటర్లను మాత్రమే డబ్బింగ్
చిత్రాలకు కేటాయించాలనీ ఇటీవలె తెలుగు చిత్ర నిర్మాతల మండలి నిర్మాతలకు లేఖ
రాసింది. దీనిపై శనివారం తమిళ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆటంకాలు
లేకుండా తమిళనాట తెలుగు చిత్రాలు విడుదలవుతున్నప్పుడు తెలుగునాట మాత్రం తమిళ
చిత్రాల విడుదలను అడ్డుకోవడం ఏమిటని దర్శక నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అలా
జరిగితే తాము కూడా తెలుగు చిత్రాల విడుదలను అడ్డుకుంటామన్నారు. ఈ నెల 22న తమిళ
నిర్మాతలు అందరూ సమావేశమై దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
డబ్బింగ్ సినిమాల విడుదలను అడ్డుకోవడం సమంజసం కాదని నిర్మాత అల్లు అరవింద్
అభిప్రాయపడ్డారు. డబ్బింగ్ సినిమాల విడుదలను అడ్డుకోవడం అయ్యేపనికాదన్నారు.
ఇప్పుడు భారతీయ సినిమాకు ఎల్లలు చెరిగిపోయాయనీ, సినిమా బాగుంటే ఎక్కడైనా
ఆడుతుందన్నారు.