ముప్పవరపు వెంకయ్యనాయుడు
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల విచారం, కుటుంబ సభ్యులకు సంతాపం
యువశక్తి చిహ్నంగా ఉండే పాత్రలు శ్రీ కృష్ణ ఎంచుకునే వారు
ప్రయోగాలకు పెద్ద పీట వేసి, తెలుగు సినిమా స్థాయిని పెంచారు
హైదరాబాద్ : తెలుగు తెరపై సూపర్ స్టార్ కృష్ణ గారి స్ఫూర్తి అజరామరమని భారతదేశ
గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కృష్ణ గారి
మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో
స్థానం సంపాదించుకున్న కృష్ణ గారి పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవని
పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి
తెలియజేశారు.
సినిమాల్లో కృష్ణ ప్రయోగాలకు పెద్ద పీట వేశారన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఆ
రోజుల్లోనే అనేక నూతన సాంకేతికతలను తెలుగు తెరకు పరిచయం చేసి, సినిమా స్థాయిని
పెంచారని ప్రశంసించారు. సగటున ఏడాదికి పది సినిమాల చొప్పున పూర్తి చేసిన శ్రీ
కృష్ణ గారి వేగం, వారి నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో
కొత్తతరం సినిమా రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని ఆకాంక్షించారు.