తెలుగుజాతి ఉన్నంత కాలం భాషకు నాశనం లేదు
‘తెలుగు భాషకు ఆద్యులు ` తెనుగోళ్ళు’ గ్రంథావిష్కరణ సభలో ఆం.ప్ర. అధికార భాష
సంఘం అధ్యక్షులు విజయబాబు
విజయవాడ : తెలుగు భాష విస్తృతి కి అనువాదాలు ఎంతో అవసరమని రాష్ట్ర అధికార భాష
సంఘ అధ్యక్షులు పి. విజయబాబు అన్నారు. ఠాగూరు స్మారక గ్రంథాలయంలో గురువారం
జరిగిన తెలుగు భాషకు ఆద్యులు ` తెనుగోళ్ళు సంకలన గ్రంధాన్ని పి. విజయబాబు
ఆవిష్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. అనంతరం జరిగిన సభలో
విజయబాబు మాట్లాడుతూ తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా పట్టు సాధించగలిగితే
మరిన్ని తెలుగు అనువాదాలు అందుబాటులోకి రాగలవన్నారు. గతంలో పెద్దలు అనేకమంది
సంస్కృతం, తెలుగు భాషలలో ప్రావీణ్యం సంపాదించబట్టే రామాయణ, మహాభారతం, భగవద్గీత
లాంటి అనేక పురాణ గాధలు తెలుగు అనువాదంలో ప్రజలకు చేరువ కాగలిగాయని అన్నారు.
ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు ఆంగ్లభాష కూడా తెలుగుతో పాటు ప్రాధాన్యత ఇవ్వవలసిన
అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 8వ తరగతి నుండి ఇంగ్లీషు
సిలబస్ప్రవేశపెడుతుంటే ఆ విధానాన్ని కూడా విమర్శిస్తుండడం బాధాకరమన్నారు. అసలు
కార్పొరేట్ విద్యాసంస్ధలు రాకతోనే తెలుగుభాషకు విఘాతం కలిగిందని అన్నారు.
భూమిపై తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుభాషకు నాశనం లేదని ప్రతి తెలుగోడి
జనసత్వాలలో తెలుగు నాటుకుపోయి ఉందన్నారు. రాష్ట్ర గ్రంధలయ పరిషత్ చైర్మన్
మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచీకరణ నేపధ్యం ఒక్క మాతృభాషకు
పరిమితం కారాదన్నారు. ఆంగ్లభాషతో ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగుపడుతున్నాయన్నారు.
ప్రస్తుతం కోట్లాది రూపాయలు వెచ్చించి తెలుగు పుస్తకలు భారీఎత్తున కొనుగోలు
చేస్తూ కవులు, రచయితలు, పబ్లిషర్లను ప్రోత్సహిస్తున్నామన్నారు. గ్రంథ
సంకలనకర్తలు పి.వి.ఎల్.ఎన్. రాజు, పిల్లి లక్ష్మీతులసి దంపతులు దశాబ్దకాలంపైగా
ఎంత శ్రమించి తొలిగా తెలుగుభాషకుసంపూర్ణ అక్షర రూపం కల్పించి, వాక్యనిర్మాణం
చేసి తొలిగా తెలుగును అధికార భాష చేసి తొలి తెలుగు శాసనం వేయించిన రేనాటిచోళ
ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు వెలుగులోకి తీసుకువచ్చారంటూ దంపతులను
ప్రస్తుతించారు. ఈ గ్రంథంలోని అంశాలనను ఉన్నత విద్యలో పాఠ్యాంశంగా , మాతృభాష
దినోత్సవం రోజు ప్రభుత్వం అధికారికంగా తెలుగుభాషకు, లిపికి ఆద్యులు అయిన
ఎరికల్ ముత్తురాజు ధనంజయుడిని స్మరించుకోవాలని , వైఎస్సార్ కడపజిల్లాలో తొలి
తెలుగు శాసనాలు ఆవిర్భవించిన కడప నగరంలో రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తురాజు
ధనంజయుడు కాంస్యవిగ్రహం ప్రతిష్టించవలసినదిగా సంకలన రచయితలు పివిఎల్ఎన్ రాజు,
శ్రీమతి పిల్లి లక్ష్మీతులసి కోరారు. విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తొలి తెలుగు
దివ్వె గౌరవ అధ్యక్షలు పరిమి రామనరసింహం అధ్యక్షతన జరిగిన సభలో డా॥ బిఆర్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రత్యేక అధికారి వెలగా జోషి, ఆంధ్ర ఆర్ట్స్
అకాడమి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు
చలపతిరావు తదితరులు ప్రసంగిచారు. చివరగా తొలితెలుగు దివ్వె ప్రధాన కార్యదర్శి
బోడి ఆంజనేయరాజు వందన సమర్పణ చేశారు.
ఆశీ. పూర్వక సత్కారాలు : వివిధ రంగాలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు
చలపతిరావు, ప్రముఖ రచయిత గుడిసేవ విష్ణుప్రసాద్, గానకోకిల కుమార సూర్యనారాయణ,
తెలుగు శాఖ ఆచార్యులు వలివేటి వెంకట శివరామకృష్ణ మూర్తి, నాట్యవేద అకాడమి
అధ్యక్షులు జంగం శ్రీనివాసచక్రవర్తి గార్లకు రాజు దంపతులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ముత్తురాజు ధనంజయుడు మీద గేయం రాసిన గుడిసేవ విష్ణుప్రసాద్, గేయం
ఆలపించిన గానకోకిల సూర్యనారాయణ గేయ ఆడియోను బ్రాహ్మణ కార్పొరేషన్ కో ఆపరేటివ్
సొసైటీ జి.ఎం. డా. కుమారస్వామి ఆవిష్కరించారు.