రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు రాక పోవడానికి కుటుంబ పార్టీలే కారణం
కొత్త పొత్తుల కోసం మేమేమీ ప్రయత్నించడం లేదు
రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరశింహారావు
విజయవాడ : రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు రాక పోవడానికి కుటుంబ పార్టీలే కారణమని
రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరశింహారావు ఆరోపించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో
ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలంగాణా,
ఆంధ్రా ముఖ్యమంత్రులు వారికి కావలసినప్పుడు మాత్రం స్నేహ బందం బాగుంటుంది.
ప్రజల సమస్యలు విషయంలో ఢిల్లీలో పరిష్కారం కావాలంటారు. అంటే ఈ వ్యాఖ్యల
ఉద్దేశ్యం ప్రజలకు అర్ధం కావలసి ఉందన్నారు ఒక పాత్రికేయుడు వేసిన ప్రశ్నకు పై
విధంగా జీవిఎల్ స్పందించారు. కమీషన్లు వచ్చే విషయంలోనే రెండు కుటుంబ
పార్టీల కు శ్రద్ద ఎక్కువ అని వ్యంగ్యోక్తులతో విమర్శలు వర్షం కురిపించారు
జీవిఎల్. గుజరాత్ లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం
సృష్టించాయి. 2024 లో 404 ఎంపి స్ధానాల్లో బిజెపి తిరుగులేని విజయం
సాధిస్తుంది . కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఉచితాల పేరుతో ప్రజలను మభ్య
పడుతున్న పార్టీలకు ప్రజలు చరమ గీతం పాడుతారు. గుజరాత్ ఎన్నికల బరిలో లేకున్నా
మోడీ హవా సాగింది. 2024 మోడీ ప్రధాని అభ్యర్ధిగా ఉంటారు కాబట్టి హవా
ఏవిధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రధాని
నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో బిజెపి జెండా ఎగురవేస్తామన్న నమ్మకం మాకు ఉంది.
ప్రత్యర్ధి పార్టీలకు అదే భయం పట్టుకుంది. టిఆర్ ఎస్ కు ఉన్న అధికారం ఊడిపోయే
లక్షణాలు ఉన్నాయి. జాతీయ పార్టీ అని ప్రగల్భాలు పలుకుతున్నారు. వైసీపీ
ఉత్తరాలిచ్చి రాష్ట్ర విభజనకు సమ్మతమే అని చెప్పింది. మేము రాష్ట్ర విభజనను
విబేధించామని జగన్ కహాని చెప్పడం మానుకోవాలి. సమైక్య రాష్ట్రం అని వైసిపి
నేతలు చెప్పడం వెనుక స్కెచ్ ఉందని జీవిఎల్ అన్నారు. 2024 లో ఓడిపోతామనే కొత్త
అంశాన్ని తెరపైకి తెస్తున్నారు .175 మీకు వస్తే సంయుక్త రాష్ట్రం అయితే
దోచుకోవచ్చు అనే స్కెచ్. రాష్ట్రం లో 8 ఇఎస్ ఐ హాస్పిటల్స్ మంజూరైతే నాలుగు
వాటికి రాష్ట్ర ప్రభుత్వం భూములివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే
మేము తయారు చేసే చార్జ్ షీట్ లో రూపొందించి ప్రజల ముందు పెట్టి దోషులుగా
నిలబెడతాం. చంద్రబాబు, జగన్ ఐటి రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారన్నారు. ఐటి రంగ
అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని పార్లమెంటు లో ప్రశ్నించానని,
రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతో అనేక కేంద్ర ప్రాజక్టు లు పెండింగ్ లో
నిలిచిపోయాయన్నారు. కమిషన్ లు వచ్చేవి తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు వైసిపి
చేపట్టడం లేదని, ఐటి లో దండుకోనే అవకాశం లేనందునే చంద్రబాబు, జగన్
విస్మరించారా అని ప్రశ్నించారు.
పార్లమెంటు లో అనేక ప్రశ్నలను సంధిస్తాం. కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందో
ఎండగడతాం. కొత్త పొత్తుల కోసం మేమేమీ ప్రయత్నించడం లేదు. జనసేన బిజెపి
పొత్తులో ఉన్నాం. బిజెపి ని సంస్ధాగతంగా ఎలా ఎదగాలో దృష్టి పెట్టాం . బిజెపి
రాష్ట్ర నేతలంతా విస్తారక్ యోజనలో మూడు రోజులుపాటు పనిచేస్తున్నారు. ఇందులో
భాగంగానే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భీమవరంలో మూడు రోజుల పాటు
మకాం వేసి సంస్థాగత పటిష్టత పై పనిచేస్తున్నారు. ఎపి ప్రజలను మభ్యపెట్టాలనే
సజ్జల వ్యాఖ్యలు చేశారని, రాష్ట్ర విభజనలో ఎపి కి అన్యాయం జరిగిన మాట
వాస్తవమే అన్నారు. రెండు రాష్ట్రాలకు జై కొట్టిన పార్టీ బిజెపి అని, రెండు
రాష్ట్రాలు కలిసే పరిస్ధితే లేదని, రెండు రాష్ట్రాల సిఎం లు ఒకరినొకరు
సహకరించుకుంటున్నారని, ప్రజల విషయం వచ్చేసరికి డ్రామాలాడుతున్నారని
విమర్శించారు.