పిల్లలను బాగా చదివించండి
జగనన్నను ఆదరించండి- మంత్రి జోగి
విజయవాడ : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మంగళవారం కంకిపాడులో స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించి, వైయస్సార్ ఆసరా పథకం నాలుగో విడత మెగా చెక్కులు పంపిణీ జేశారు.
కంకిపాడు, గొడవర్రు, ప్రొద్దుటూరు, మద్దూరు, కే వి పాలెం, ఈడ్పుగల్లు గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన ఈ సమావేశంలో ఈ 6 గ్రామాలకు సంబంధించి 519 గ్రూపులకు చెందిన 5190 మంది సభ్యులకు రు.4.99 కోట్ల రూపాయలు, కంకిపాడు మండలానికి సంబంధించి నాలుగో విడత 1209 గ్రూపులకు రు.11.28 కోట్ల రూపాయల మెగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా, మహిళ స్వయం సహాయ సంఘాలకు రుణమాఫీ గావించి డబ్బులు వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్నే అన్నారు. 2019లో అప్పటివరకు డ్వాక్రా మహిళ గ్రూపులకు ఉన్న అప్పు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి, ముఖ్యమంత్రి కాగానే వైయస్సార్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి, ఇప్పటివరకు 3విడతలుగా మహిళలకు డబ్బులు వేసి, ఇప్పుడు 4వ విడత పంపిణీ చేస్తున్నట్లు, జగనన్న మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి అంటూ మంత్రి కొనియాడారు.
మహిళలను లక్షాధికారులుగా చేసిన ముఖ్యమంత్రి జగన్ అంటూ, గ్రూపుకు 20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రంలోనైనా అమ్మఒడి అమలు చేశారా? వైయస్సార్ చేయూత ఇచ్చారా? రేషన్ డోర్ డెలివరీ చేశారా? ఇళ్ల స్థలాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చారా? అంటూ మంత్రి ప్రశ్నలు సంధించారు.
కానీ మన జగనన్న ఇస్తున్నారని, జగనన్నకు మీ చల్లని ఆశీస్సులు అందించాలని మహిళలను కోరారు. డబ్బు శాశ్వతం కాదు, విద్యా విజ్ఞానం శాశ్వతం, విద్య ద్వారానే పేదరికం నిర్మూలన సాధ్యమని నమ్మిన వ్యక్తి జగనన్న, గ్రామాలలో ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులో లేని పరిస్థితులలో జగనన్న నిరుపేదలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఎదగాలని ఆశించారని అన్నారు. పౌష్టికాహారంతో కూడిన జగనన్న గోరుముద్ద పథకం అమలు చేస్తున్నారని అన్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద పేదలు కలలో కూడా ఊహించని విధంగా విదేశీ విద్య కోసం రు.1.25 కోట్ల వరకు అందిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేసి 14 రకాలైన వైద్య పరీక్షలు, 105 రకాల మందులు ఉచితంగా అందిస్తూ ఆరోగ్య సురక్ష కింద ఇంటి వద్దకే డాక్టర్ను పంపి వైద్య పరీక్షలు చేయిస్తున్నారని, పేదల ఆరోగ్యం పట్ల జగనన్నకు ఎంతో శ్రద్ధ అన్నారు. ఆరోగ్యశ్రీ క్రింద 25 లక్షల వరకు వైద్యo పెంపు చేస్తూ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. జగనన్న 124 సార్లు బటన్ నొక్కి మీకు డబ్బులు వేశారు. మీరు నాకు ఒకసారి , ఎంపి కి ఒకసారి బటన్ నొక్కండి అంటూ మహిళలకు సూచించారు. ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయండి, నా ఫోన్ నెంబర్ 98480 47522 రాసుకోండి, మీ ఇబ్బందులు తెలుసుకొని చేతనైన సాయం చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆసరా లబ్ధిదారులు జగనన్న పథకాలు పొంది తమ కుటుంబాలు ఎలా అభివృద్ధి చెందాయో వివరించి జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. తొలుత మంత్రి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, కంకిపాడు మండల జడ్పిటిసి బాకీబాబు, టిడ్కో డైరెక్టర్ పి.రాఘవరావు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్ రమాదేవి, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ఈడే చాముండేశ్వరి, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బిందు మాధవి, యువ నాయకులు జోగి రాజీవ్, గ్రామ సర్పంచ్ బాకీ రమణ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీడీవో అనూష, వెలుగు సిబ్బంది, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.