ధనుష్ ని హిందీకి పరిచయం చేసిన తొలి చిత్రం’రాంజనా’. తొలి ప్రయత్నంలోనే
ఉత్తరాది ప్రేక్షకుల మనసుల్ని దోచి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు ధనుష్. ఆ
సినిమా విడుదలై పదేళ్లయింది. ఈ సందర్భంగా అదే బృందం మరో కొత్త సినిమాని
ప్రకటించింది. “తేరే ఇష్క్ మే” పేరుతో రూపొందనున్న ఈ సినిమాని బుధవారం
అధికారికంగా ప్రకటించారు. ధనుష్ ట్విటర్ ద్వారా ‘రాంజనా’ని గుర్తు
చేసుకుంటూనే, కొత్త సినిమా ప్రయాణంపై తన మనసులో మాటని వెల్లడించారు. కొన్ని
సినిమాలు జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి. ‘రాంజనా’ మా అందరి జీవితాల్ని
మార్చింది. దాన్నొక క్లాసిక్గా మార్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు,
దశాబ్దం తర్వాత ‘రాంజనా ప్రపంచం నుంచి మళ్లీ వస్తున్న ఓ చిత్రం ‘తేరే ఇష్క్
మే’. ఈ సినిమాతో ఓ సాహసోపేతమైన ప్రయాణం చేయబోతున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు
ధనుష్. ఈ సినిమాకి దర్శకుడు:ఆనంద్ ఎల్ రాయ్. నిర్మాణం: హిమాను శర్మ. సంగీతం
:ఎ.ఆర్ రెహమాన్.