ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్‌కు లేఖ రాశారు. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన తొక్కిసలాటలో 20 మందికి పైగా విదేశీయులతో సహా 153 మంది మరణించిన విషాదకరమైన ప్రాణనష్టంపై మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాలో హాలోవీన్ వేడుకల కోసం పదివేల మంది ప్రజలు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. తర్వాత సియోల్‌లోని ప్రసిద్ధ నైట్‌లైఫ్ జిల్లాలోని హామిల్టన్ హోటల్ సమీపంలోని ఇరుకైన ప్రాంతంలో శనివారం రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 150 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనపై కలత చెందిన ప్రధానిమోదీ దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యున్ సుక్ యోల్ కి లేఖ రాశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు దక్షిణ కొరియాలోని భారత రాయబార కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది.