తొక్కల్లో సుగుణాలు దాగి ఉంటాయి. కనుక వాటిని తినడం చాలా మంచిది.
ఆలు తొక్క:
ఆలు పొట్టులో ఫైబర్, విటమిన్-B, ఐరన్ పుష్కలం, వేయించినా ఉడికించినా పొట్టు
మాత్రం తియ్యకూడదు.
కీరదోస తొక్క:
పొట్టులోని ఫైబర్ జీర్ణక్రియకు బాగా తోడ్పడుతుంది. ఆర్గానిక్ కీరాను ఎంచుకోవటం
ఉత్తామం.
యాపిల్ తొక్క:
యాపిల్ తొక్కలో చాలా విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి,
జీర్ణక్రియకు మంచిది.
క్యారెట్ తొక్క:
క్యారెట్ తొక్కలో బీటాకెరాటిన్ ఉంటుంది. వీటిని శుభ్రంగా కడిగి తినడం
మర్చిపోవద్దు.
వంకాయ తొక్క:
వంకాయలో నాసునిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి అవసరం.
బెర్రీస్ తొక్క:
స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ ఏ బెర్రీ ఫ్రూట్ అయినా సరే వాటి తొక్కల్లో యాంటి
ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కావున వీటి తొక్కను పారవేయకండి.
చిలగడ దుంప పొట్టు:
చిలగడ దుంపల పొట్టులో ఫైబర్, యాంటి ఆక్సిడెంట్స్ తో పుష్కలం. ఉడికించినా,
వేయించినా సరే తొక్కతోనే తినండి.