విజయవాడ : తొలి సామాజిక విప్లవకారుడు, అగ్రకులాల దురహంకార వ్యవస్థ పై పోరాడి,
బీసీ కాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని, పేద కులాలకు
ప్రాధాన్యం వైసిపి ప్రభుత్వం కల్పిస్తుందని, సామాజిక ఉద్యమానికి పునాదులు
వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,పూలే అడుగుజాడల్లో నడుస్తున్న వైయస్
జగన్మోహన్ రెడ్డి అని ప్రసంగించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. సోమవారం ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల
తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం
ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం 17వ రాష్ట్ర మహాసభలు మరియు డైలీ
ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీ సి, ఎస్
సి, ఎస్ టి, మైనార్టీలకు సమన్యాయం సమతూక న్యాయం అందిస్తున్న ఘనత జగన్మోహన్
రెడ్డిదని, వెనుకబడిన కులాల విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి
ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.
పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు
కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రీమిలేయర్ ను
తొలగించాలని కోరారు. ప్రైవేట్ రంగంలో 90 శాతం ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ,
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. హైకోర్టు సుప్రీంకోర్టులో రెండు శాతం
కూడా బీసీ జడ్జిలు లేరని, అందుకే తీర్పులు బీసీలకు వ్యతిరేకంగా
వస్తున్నాయన్నారు. బీసీ ఉద్యోగ సంఘాలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే
ఉన్నాయని వారికి రావాల్సిన హక్కులు వారికి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్రంలోని వివిధ ప్రాంతానికి సుమారుగా 5000 మంది బీసీ ఉద్యోగులు
పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీసీ ఉద్యోగ సంఘాల
నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.