నెట్టింట వైరల్గా మారిన ఫొటోలు
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఎలాంటి సినీ బ్యాక్
గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి, సైడ్
హీరోగా చేసి ఆ తర్వాత హీరోగా వరుస సినిమాలతో హిట్స్ కొట్టి నేచురల్ స్టార్ గా
ఎదిగారు. ఇటీవల వరుసగా డిఫరెంట్ కథలతో వస్తూ ప్రేక్షకులని మెప్పించడానికి
ప్రయత్నిస్తున్నారు. త్వరలో దసరా అనే పూర్తి మాస్ సినిమాతో రాబోతున్నారు.
తాజాగా నాని ఫిబ్రవరి 24న తన పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్
చేసుకున్నారు. శుక్రవారం నాని పుట్టినరోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు,
పలువురు ప్రముఖులు నానికి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఇక నాని తన పుట్టిన
రోజు వేడుకలను శుక్రవారం రాత్రి గ్రాండ్ గా తన స్నేహితులు, తోటి ఆర్టిస్టులతో
జరుపుకున్నారు. నాని పుట్టిన రోజు వేడుకలకు అల్లరి నరేష్, నిర్మాత స్వప్నదత్,
హీరోయిన్ నజ్రియా, ఫహద్ ఫాజిల్.. మరికొంతమంది నటులు, నాని కుటుంబ సభ్యులు
పాల్గొన్నారు. నాని పుట్టిన రోజు వేడుకలకు ఫహద్ ఫాజిల్, అల్లరి నరేష్, నజ్రియా
రావడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.