అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో ఈనెల 7 నుంచి 9 వరకు
బొడ్రాయి ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే తోపుదుర్తి
ప్రకాష్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ
నేపథ్యంలో శనివారం గ్రామ మహిళలకు, పెళ్లిళ్లు చేసుకుని ఇతర ప్రాంతాల్లో
ఉంటున్న తోపుదుర్తి గ్రామ ఆడబిడ్డలకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వడి బియ్యం
కానుక అందజేశారు. మూడు వేల మంది మహిళలకు ఒడి బియ్యం పోసి పసుపు కుంకుమ పెట్టి
చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంతో తోపుదుర్తి గ్రామంలో పండుగ వాతావరణం
నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరులు
తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులు
పాల్గొన్నారు.