అగర్తల: బీజేపీ పెద్దల సమక్షంలో త్రిపుర కొత్త ముఖ్యమంత్రి మాణిక్ సాహా
ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. త్రిపుర
ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ
ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రిగా మరోసారి సాహానే ఎంపిక
చేసింది. దాంతో ఆయన రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఈ కార్యక్రమానికి
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా,
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల
సీఎంలు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలున్న త్రిపుర
అసెంబ్లీలో బీజేపీ 32 సీట్లు కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన
విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మిత్రపక్షం ఐపీఎఫ్టీ పార్టీతో కలిసి ప్రభుత్వం
ఏర్పాటు చేసింది. మొదట్లో ముఖ్యమంత్రి పదవికి సాహాతో పాటు కేంద్రమంత్రి
ప్రతిమా భౌమిక్ పేరు కూడా వినిపించింది. అయితే నూతనంగా ఎన్నికయిన ఎమ్మెల్యేల
సమావేశంలో సాహాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. బిప్లవ్ దేబ్ స్థానంలో
సాహా గతేడాది మార్చి 14న త్రిపుర సీఎంగా బాధ్యతలు చేపట్టారు.మోడీ, షా, నడ్డా సమక్షంలో త్రిపుర సీఎంగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం :
త్రిపుర ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం చేశారు. అగర్తలాలోని
వివేకానంద మైదాన్‌లో బుధవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ
అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా,
బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. కాగా
మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండోసారి. కిందటి ఏడాది
విప్లవ్ కుమార్ దేవ్ రాజీనామాతో అనూహ్యంగా మాణిక్ సాహాను తెర మీదకు
తెచ్చింది బీజేపీ. మే 15వ తేదీన మాణిక్ సాహా త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు
చేపట్టారు. బోర్దోవాలీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం
వహిస్తున్నారు. అంతకు ముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. త్రిపుర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2020 నుంచి 2022 మధ్య ఆయన పని చేశారు. అయితే..
ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం మొదలైంది కాంగ్రెస్ పార్టీతోనే. 2016లో ఆయన
కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. గతంలో త్రిపుర క్రికెట్ అసోషియేషన్‌కు
ఆయన అధ్యక్షుడిగా పని చేశారు.