అందుకు తగ్గట్లుగానే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని వెల్లడి
పాత పార్లమెంట్ భవనంలో కూర్చోవడానికే ఇబ్బంది ఉండేది
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ సీట్లపై ప్రధాని
నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య
పెరుగుతుందని అన్నారు. అందుకు తగ్గట్లుగానే అధునిక వసతులతో కొత్త భవానాన్ని
నిర్మించామని తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ ను 1,272 మంది సభ్యులు
కూర్చునేందుకు వీలుగా నిర్మించామని వెల్లడించారు. పాత పార్లమెంట్ భవనంలో
కూర్చోవడానికే కాకుండా సాంకేతికంగానూ ఇబ్బంది ఉండేదని మోడీ చెప్పారు. పాత
పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు సాగించడం ఎంత కష్టంగా ఉండేదో మీకు తెలుసు.
కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అందుకే కొత్త పార్లమెంట్ భవనం
నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు. ఇంకో విషయం ఏంటంటే భవిష్యత్ లో
సీట్ల సంఖ్య పెరుగుతుంది. సభ్యులు పెరుగుతారు. మరి వాళ్లంతా ఎక్కడ
కూర్చుంటారు?అందుకే ఇదే సమయమని భావించి కొత్త బిల్డింగ్ నిర్మించాం అని
వివరించారు.