భారత ప్రధాని నరేంద్ర మోడీ
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ
అన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో ఆయన పరోక్షంగా పాకిస్థాన్‌కు చురకలంటించారు.
భారత్ ప్రస్తుతం 5వ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే 3వ స్థానానికి
చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు
జో బైడెన్ ఏర్పాటు చేసిన విందుకు ప్రధాని నరేంద్ర మోడీ సహా వ్యాపారవేత్తలు
ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎటువంటి
సందేహాలకు తావు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదాన్ని
ప్రోత్సహించే వాళ్లపై చర్యలు తీసుకోవాలని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి
మోడీ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతినిధుల సభలో గంట పాటు ప్రసంగించిన నరేంద్ర
మోడీ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు
గడిచాయని , ’26/ 11′ దాడులు జరిగి దశాబ్దం గడుస్తున్నా రాడికలిజం, ఉగ్రవాదం
ఇప్పటికీ ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. చైనాపై కూడా ప్రధాని నరేంద్ర
మోడీ పరోక్ష దాడికి దిగారు. ఐక్య రాజ్యసమితి చార్టర్ సూత్రాలపై గౌరవం,
వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను
గౌరవించడంపైనే గ్లోబల్ ఆర్డర్ ఆధారపడి ఉందని చైనాను ఉద్దేశించి మోదీమోడీ
అన్నారు. మరోవైపు తాను ప్రధానిగా మొదటిసారి అమెరికాను సందర్శించినప్పడు భారత్
ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ప్రస్తుతం 5వ స్థానంలో
ఉందని తెలిపారు