‘ఝుమ్మందినాదం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన తాప్సీ అప్పట్లో తెలుగుతో పాటు
దక్షిణాది భాషల్లో వరుసగా చిత్రాలు చేసినా స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయింది. ఈ
క్రమంలో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఆమెకు అక్కడ విజయాలు దక్కాయి.నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన ఆమె తనకు నటిగా అవకాశం ఇచ్చిన దక్షిణాది
చిత్ర పరిశ్రమపై నోరు పారేసుకుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటించిన
సినిమాలతో తనకు ఎలాంటి గుర్తింపు, స్టార్డమ్ రాలేదని చెప్పింది. నటిగా అక్కడ
సంతృప్తే దొరకలేదని, అందుకే బాలీవుడ్ వైపు వచ్చేశాననని తెలిపింది.

అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘పింక్’ చిత్రం చేయడంతో తన సినీ జీవితం గొప్ప మలుపు
తిరిగిందని చెప్పింది. బాలీవుడ్ ను పొగిడే క్రమంలో సౌత్ ఇండస్ట్రీని చులకన
చేసిన తాప్సీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీని, తనను పరిచయం చేసిన దర్శకేంద్రుడు
రాఘవేంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్,
ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని అందుకున్న సౌత్
ఇండస్ట్రీపై తాప్సీ ఇలా మాట్లాడటం తగదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు