ప్రముఖ నటి సమంత, అక్కినేని నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరి జీవనం
సాగిస్తోంది. దీంతో ఓ అభిమాని ఆవేదన లేదా ఆసక్తితో చేసిన ఓ సూచన అభిమానుల్లో
పెద్ద చర్చకు తావిచ్చింది.ఈ నెల 26న ‘స్రవంతి సీఎం’ అనే ట్విట్టర్ యూజర్ సమంతకు అనుకోని విధంగా ఓ సూచన
చేసింది. ‘‘చెప్పడానికి ఇది నా స్థానం కాదని తెలుసు. కానీ, దయచేసి ఎవరితో
అయినా డేట్ చేయి’’ అంటూ ట్వీట్ చేసింది. కానీ, దీనికి సమంత ఇచ్చిన బదులు అందరి
హృదయాలను గెలుచుకుంది. ‘‘మీ అంతలా నన్ను ఎవరు ప్రేమిస్తారు..?’’ అని సమంత
బదులిచ్చింది. సమంత సమాధానం చాలా మంది హృదయాలను గెలుచుకుంది. అభిమానులు ఎవరికి
తోచినట్టు వారు స్పందిస్తున్నారు. ‘హాయ్ సమంత ఈ ప్రపంచంలో అన్నింటికంటే నేను
నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను’ అని ఓ యూజర్ స్పందించాడు.

వైవాహిక బంధం తెగిపోవడంతో సమంత తన దృష్టినంతా సినిమాలపైనే కేంద్రీకరించింది.
వరుస సినిమాలతో ప్రస్తుతం ఆమె ఎంతో బిజీగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన
శాకుంతలం త్వరలోనే (ఏప్రిల్ 14) విడుదల కానుంది. తర్వాత ఖుషీతో అభిమానుల
ముందుకు రానుంది. వచ్చే సెప్టెంబర్ 1కి ఇది విడుదల కావచ్చని తెలుస్తోంది.