ఏలూరు : స్పందన కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు సంతృప్తికరమైన స్థాయిలో
పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వై. ప్రసన్న వెంకటేష్ అధికారులను
ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో స్పందన
కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి
అక్కడికక్కడే అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా
కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్పందన దరఖాస్తులు రీఓపెన్ కాకుండా
ప్రజలకు సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. అర్హతలేని దరఖాస్తులకు
సంబంధించి అందుకు గల కారణాలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు.
స్పందన దరఖాస్తుదారులు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా స్థాయి స్పందన
కార్యక్రమానికి రానవసరం లేకుండా మండల స్థాయిలోనే పరిష్కారం సంతృప్తికరమైన
స్థాయిలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను
ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో స్పందన
కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి
అక్కడికక్కడే అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్పందన కార్యక్రమంలో అర్జీలు స్వీకరించడం
జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఉంగుటూరు మండలం చినవెల్లమిల్లి గ్రామానికి
చెందిన అన్నంరెడ్డి శ్రీనివాసరావు తన దరఖాస్తులో తన కుమార్తె ఆశాజ్యోతి
సెరెబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతున్నదని , తన కుమార్తెకు వై.ఎస్.ఆర్.
పెన్షన్ కానుకలో దీర్ఘకాలిక వ్యాధులకు అందించే పెన్షన్ అందించవలసిందిగా
కోరారు. ఆశాజ్యోతి వద్దకు వెళ్లి సమస్యను స్వయంగా చూసే తెలుసుకున్నారు. ఈ
సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని
కలెక్టర్ ఆదేశించారు. గణపవరం మండలం సరిపల్లె గ్రామానికి చెందిన నేతల
నాగేశ్వరరావు, తదితరులు తమ భూమి ఆక్వాజోన్ పరిధిలో ఉందని, తమ సాగుకు
ఆక్వాజోన్ పరిధిలోని విద్యుత్ సబ్సిడీ అందించాలని కోరగా, దరఖాస్తును
పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను కలెక్టర్
ఆదేశించారు. నూజివీడు పట్టణానికి చెందిన ప్రజలు తమ దరఖాస్తులో నూజివీడు
పట్టణంలోని నాసినచెరువు పరిధిలోని జలవనరులు, రహదార్లు, భవనాల శాఖకు చెందిన 50
సెంట్ల భూమిని కొంతమంది ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని,
వీటిని వెంటనే నిరోధించాలని కోరగా వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని
రహదార్లు, భవనాల శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెదపాడు మండలం వట్లూరు
గ్రామ పంచాయతీకి చెందిన ప్రజలు ఎస్.సి. పేటలో డ్రైనేజ్ నిర్మాణం సరిగ్గా లేక
మురుగు సరిగా ప్రవహించక ఆ ప్రాంతం అంత మురుగునీటితో ముంపునకు గురవుతున్నది, తమ
సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యను వెంటనే పరిశీలించి పరిష్కారానికి
చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.