గుంటూరు : ఆయన సినిమాల్లో గజ్జెలు ఘల్లుమంటే.. ప్రేక్షకుల గుండెలు
ఝల్లుమంటాయి.. అందెల రవళి వింటుంటే.. అభిమానుల
హృదయాలు అంబరాన్ని తాకుతాయి.. అమృతగానాలు చెవినపడి..అమితానందపు ఎదసడిని
కలిగిస్తాయి.. సంగీత, నృత్యాలు కలగలిసి.. సాగరసంగమాన్ని తలపిస్తాయి.. ఈ గాలి..
ఈ నేల.. ఈ సినిమా తమదనిపిస్తాయి.. ఆయన సినిమాలు చూస్తుంటే…సరస స్వర సుర ఝరీ
గమనం గుర్తొస్తుంది..ఆయనే కె.విశ్వనాథ్.. కళాతపస్వి విశ్వనాథ్…
ఏ ఖజురహోలోనో, హళేబీడులోనో, అజంతా ఎల్లోరా గుహల్లోనో శ్రద్ధగా చెక్కిన
శిల్పాల్లాగా ఆయన సినిమాలు సినీ ప్రేక్షకుల కళ్లముందు కొలువుదీరాయి. ఆయన
దర్శకత్వం వహించిన ఏ సినిమా గురించైనా ఒక్కో ప్రత్యేకమైన వ్యాసం రాయవచ్చు.
అన్నీ గుదిగుచ్చి చెప్పాలంటే విహంగవీక్షణమే శరణ్యం.
తొలి సినిమాతోనే నంది అవార్డు
కె.విశ్వనాథ్ తొలిసారి దర్శకుడిగా మారి 1963లో తీసిన ‘ఆత్మగౌరవం’ సినిమాలోనే
ఆయన ప్రతిభ ఏంటో తెలుస్తుంది. తొలి ప్రయత్నంతోనే నంది అవార్డును అందుకున్న ఆ
సినిమాను ఇప్పటి యువతరం చూసినా వారికి విసుగు కలిగించని రీతిలో కథనం ఉంటుంది.
అక్కినేని, కాంచన, రాజశ్రీలతో రైతుకుటుంబం నేపథ్యంలో తీసిన ఆ సినిమాలో ‘అందెను
నేడే అందని జాబిల్లి.. నా అందాలన్నీ ఆతని వెన్నెలలే..’ అన్న పాటని, ‘రానని
రాలేనని ఊరక అంటావు.. రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు?’ పాటని ఓసారి చూడండి.
శృంగారం అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఆ పాటల చిత్రీకరణ తీరు ఈనాటి యువతరానికి
కూడా గిలిగింతలు పెడుతుంది.
ఇలా చూస్తే ‘శుభలేఖ’లో ‘రాగాల పల్లకిలో కోయిలమ్మ..’పాటను తల్చుకున్నా,
‘ఆపద్బాంధవుడు’లో ‘ఔరా.. అమ్మకచెల్ల.. ఆలకించి నమ్మడమెల్ల..’పాటను చూసినా, ఇలా
ఒకటేమిటి, విశ్వనాథ్ సినిమాల్లో సున్నితమైన భావజాలాన్ని, ప్రేమ చేసే
ఇంద్రజాలాన్ని మనసుకు హత్తుకుపోయే రీతిలో చిత్రీకరించే తీరుకు మెచ్చుతునకలు
అనేకం కనిపిస్తాయి. ఏ ఖజురహోలోనో, హళేబీడులోనో, అజంతా ఎల్లోరా గుహల్లోనో
శ్రద్ధగా చెక్కిన శిల్పాల్లాగా ఆయన సినిమాలు సినీ ప్రేక్షకుల కళ్లముందు
కొలువుదీరాయి. ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమా గురించైనా ఒక్కో ప్రత్యేకమైన
వ్యాసం రాయవచ్చు. అన్నీ గుదిగుచ్చి చెప్పాలంటే విహంగవీక్షణమే శరణ్యం.
కె.విశ్వనాథ్ తొలిసారి దర్శకుడిగా మారి 1963లో తీసిన ‘ఆత్మగౌరవం’ సినిమాలోనే
ఆయన ప్రతిభ ఏంటో తెలుస్తుంది. తొలి ప్రయత్నంతోనే నంది అవార్డును అందుకున్న ఆ
సినిమాను ఇప్పటి యువతరం చూసినా వారికి విసుగు కలిగించని రీతిలో కథనం ఉంటుంది.
అక్కినేని, కాంచన, రాజశ్రీలతో రైతుకుటుంబం నేపథ్యంలో తీసిన ఆ సినిమాలో ‘అందెను
నేడే అందని జాబిల్లి.. నా అందాలన్నీ ఆతని వెన్నెలలే..’అన్న పాటని, ‘రానని
రాలేనని ఊరక అంటావు.. రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు?’పాటని ఓసారి చూడండి.
శృంగారం అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఆ పాటల చిత్రీకరణ తీరు ఈనాటి యువతరానికి
కూడా గిలిగింతలు పెడుతుంది.