బాలాయపల్లి (వెంకటగిరి ఎక్స్ ప్రెస్ ):-
వ్యవసాయ కూలి పనులకు వెళ్లిన దళితుడు దార వెంకటయ్య పై దాడి చేయడంతో ఆసుపత్రి పాలై న సంఘటన మండలంలోని వాక్యం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు కథనం మేరకు అదే గ్రామానికి చెందిన కోలా నరేష్ అనే రైతుకు నిమ్మ చెట్లు తోవ్వే ఎందుకు ఉదయం 6 మంది కూలీలు వెళ్ళారు. అతను వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కొమ్మి నాగయ్య నాయుడు, కొమ్మి. శ్రీనివాసులు నాయుడులు కులం పేరుతో హర్ష పదజాలం వాడుతూ దాడి చేయడంతో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఆయనతో కూలి పనులకు వెళ్లిన తోటి కూలీలు గూడూరు ఆసుపత్రికి తరలించారు.
మాట్లాడితే చంపేస్తా :-
రాయ్ మీరు ఎమనుకుంటున్నారు.కూలి పనులు చేసుకునే వారు. వాడికి పనికి పోవద్దు అని చెప్పా ఎలా పోతారు.మీ అంతుచూస్తా… కారంచేడు తెలుసా మీకు అదే పరిస్థితి మీకు జరుగుతుంది.
నా మాట మీరు వినకపోతే అందరిని చంపేస్తా. అంటూ పరుష పదజాలం వాడుతూ ఊగిపో యారు.
పోటీ :- ఆస్పుత్రిలో చికత్సపోందుతున్న వెంకటయ్య