ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులను, గిరిజనులను
చిన్నచూపు చూస్తోందని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ద్వజమెత్తారు.
సోమవారం రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో
వైసిపి ప్రభుత్వం దళిత, గిరిజనలకు చేస్తోన్న ద్రోహంపై తప్పుపట్టారు. ఎస్సీ,
ఎస్టీ వర్గాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో ఏర్పాటుచేసిన సబ్ ప్లాన్ నిధులను
వైసిపి ప్రభుత్వం తమ పార్టీ ప్రవేశపెట్టిన స్వంత పథకాలైన నవరత్నాల కు
వాడుకుంటుందని విమర్శించారు. అవి నవరత్నాలు కావని దళిత, గిరిజనుల పట్ల
నవవినాశకాలని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలు దళిత, గిరిజన ల అభ్యున్నతికి అనేక
పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.కనీసం
ఇంతమంది దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు వున్నా ఒక్కరు కూడా దళిత, గిరిజనులకు
జరుగుతున్న అన్యాయం పై ప్రశ్నించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత,
గిరిజనులకు అధికారం అందని ద్రాక్ష గానే మిగిలిపోతొందని, ఈ ప్రభుత్వంలో దళిత,
గిరిజనులకు అనేక పదవులు ఇచ్చాం అని వూకడంపుడు మాటలు చెప్పుకునే ఈ ప్రభుత్వం,
కనీసం వాళ్ళు కూర్చోవటానికి కుర్చీ, బల్ల కూడా లేదని అన్నారు. కొద్దిపాటి
గౌరవం కూడా దక్కట్లేదని విచారం వ్యక్తంచేశారు.