అందరికీ తెలిసిందే. అయితే పండ్లు మాత్రమే కాకుండా వాటి ఆకులతో టీ కాచుకుని
తాగితే బోలెడన్ని లాభాలు ఉన్నాయి అవేంటో చూద్దాం..
* దానిమ్మ ఆకులతో టీని రోజుకు రెండు పూటలా తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి
సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది.
* ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నందున దానిమ్మ
ఆకుల రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతుంది.
* వీటి పేస్ట్ ను చర్మం పైనా రాసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
* తరచూ వాంతులు అవుతున్న వారు ఈ పొడిని రోజూ వేడి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల
మంచి ఫలితం ఉంటుంది.
* గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటివి దరి చేరకుండా ఉండాలంటే దానిమ్మ ఆకుల టీ
తాగాలి.
* ఇప్పుడున్న బిజీ బిజీ జీవితంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య నిద్రలేమి.
అలాంటి వారు ఈ టీని కచ్చితంగా తీసుకోవాలి.
* మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ ఆకుల టీ ఉపయోగపడుతుంది. అలా అని
అధికంగా తీసుకోకూడదు.