కడప : సుప్రసిద్ధ భారతీయ సిమెంట్ కంపెనీ, దాల్మియా భారత్ లిమిటెడ్, 6వ
ఎడిషన్ ఇండియన్ సిమెంట్ రివ్యూ అవార్డులు 2022–23 వద్ద భారీ విభాగంలో
‘అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మూడవ సిమెంట్ కంపెనీ’గా అవార్డు పొందింది.
దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్ యూనిట్ హెడ్ ముకేష్ సిన్హా,
కంపెనీ తరపున ఈ అవార్డును ఫస్ట్ కనస్ట్రక్షన్ కౌన్సిల్ వ్యవస్థాపకులు,
అధ్యక్షులు ప్రతాప్ పదోద్, ఏసీసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్
బెనర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఆరవ ఇండియన్ సిమెంట్ రివ్యూ అవార్డులను
ఫస్ట్ కన్స్ట్రక్షన్ కౌన్సిల్, ఇండియా సిమెంట్ రివ్యూ పబ్లికేషన్
అందించింది. ఈ అవార్డు వేడుక హైదరాబాద్‌లో జరిగిన 13వ సిమెంట్ ఎక్స్పో
2023, 8వ ఇండియన్ సిమెంట్ రివ్యూ కాన్ఫరెన్స్ 2023 లో భాగంగా నిర్వహించారు.
ఈ అవార్డు అందుకున్న సందర్భంగా డీసీబీఎల్, కడప యూనిట్ హెడ్ ముకేష్
సిన్హా మాట్లాడుతూ ‘‘దాల్మియా భారత్ వద్ద , పర్యావరణ అనుకూల ప్రక్రియలతో
పాటుగా నిర్వహణ, కార్యకలాపాల శ్రేష్టత వంటివి మా వృద్థి కథలో అత్యంత కీలక
పాత్ర పోషిస్తుంటాయి. ఈ గుర్తింపును నేడు మేము పొందడం పట్ల సంతోషంగా ఉన్నాము.
ఈ అవార్డు మాకు స్ఫూర్తిదాయకంగా ఉండటంతో పాటుగా మా లక్ష్యాలను చేరుకోవడంలో మా
ప్రయత్నాలకు స్ఫూర్తి కలిగిస్తూనే నూతన బెంచ్‌మార్క్స్‌ను సృష్టించనుందని
అన్నారు. 8వ ఎడిషన్ సిమెంట్ రివ్యూ కాన్ఫరెన్స్ నేపథ్యంగా ‘‘కేస్
(కాస్ట్ ఎఫిషియెన్సీ ఆటోమేషన్, స్కిల్లింగ్, ఎనర్జీ ఎఫిషియెన్సీ) ఫర్
సస్టెయినబిలిటీ అండ్ డీ కార్బనైజేషన్’ ను ఎన్నుకున్నారు. 2030 నాటికి కార్బన
ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకోవడానికి స్థిరమైన పద్ధతులను అవలంభించడం,
అతి తక్కువ కార్బన్ సిమెంట్ పంపిణీ చేయడంపై పర్యావరణ అనుకూల విధానాలను
స్వీకరించే దిశగా సిమెంట్ పరిశ్రమ దృష్టి సారించడంను సైతం ఈ సమావేశం
ప్రస్తావించింది. నేడు, దాల్మియా సిమెంట్
వినియోగిస్తున్న ముడి పదార్థాలలో దాదాపు 40% పారిశ్రామిక వ్యర్థాలు
(అంతర్జాతీయంగా సిమెంట్ రంగంలో ఇంత మొత్తంలో వినియోగించడం అత్యధికం).
అంతేకాకుండా తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో 80% బ్లెండెడ్ సిమెంట్. సిమెంట్
క్లింక్లలో దాదాపు 18% హీట్‌ను మున్సిపల్ సాలిడ్ వ్యర్ధాలు
(ఎంఎస్డబ్ల్యు), పారిశ్రామిక వ్యర్థాలు అందిస్తున్నాయి. వీటిలో నాన్
రీసైక్లిబల్ ప్లాస్టిక్స్, ఫార్మా, మొదలైన వ్యర్ధాలు ఉన్నాయి. దాల్మియా
సిమెంట్ 13.3 రెట్లు నీటి సానుకూలత కలిగి ఉండటంతో పాటుగా 2025 నాటికి 20
రెట్లు వాటర్ పాజిటివ్ కావడానికి కట్టుబడింది. మొత్తం వ్యవస్థాపక సామర్థ్యం
37 మిలియన్ టన్నులు కాగా, 2040 నాటికి కార్బన్ నెగిటివ్‌గా మారాలనే లక్ష్యం
దిశగా నిబద్ధత చాటిన మొట్టమొదటి సిమెంట్ గ్రూప్‌గా దాల్మియా భారత్ నిలిచింది.