అమెరికా గరిష్ఠ రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుకు సెనెట్ ఆమోదం
తెలిపింది. బిల్లుపై చర్చ చేపట్టిన సెనెట్ ఆమోదం తెలిపి అధ్యక్షుడి సంతకం కోసం
పంపింది. దీంతో అగ్రరాజ్యం దివాలా గండం నుంచి గట్టెక్కినట్లైంది. అమెరికా
రుణపరిమితిని పెంచేందుకు తీసుకువచ్చిన బిల్లుకు సెనెట్ ఆమోదం తెలిపింది. గడుపు
సమీపిస్తున్న వేళ దీనిపై చర్చ చేపట్టింది సెనెట్. అనంతరం ఆమోదం తెలిపి
అధ్యక్షడు జో బైడెన్ అనుమతి కోసం పంపింది. దీనికి సంబంధించి అధ్యక్షుడు
జోబైడెన్, స్పీకర్ కెవిన్ మెకార్థీ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. ఈ
బిల్లు ఆమోదానికి మార్గం సుగమమైంది. రెండు పార్టీలకు చెందిన మోజారిటీ సభ్యులు
ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. 314- 117 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది.
165-46 ఓట్ల తేడాతో డెమొక్రాట్లు మద్దతు ఇవ్వగా, 149-71 ఓట్లతో రిపబ్లికన్లు
మద్దతు ఇచ్చారు.