ఎంపీ విజయసాయిరెడ్డి
విజయవాడ : దివ్యాంగులకు సంక్షేమం అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని
అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్,
పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ విజయ సాయిరెడ్డి అన్నారు. వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగ సమావేశాన్ని విజయసాయి రెడ్డి టెలి
కాన్ఫరెన్స్ ద్వారా తాడేపల్లి లో పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన
తర్వాత వేలాదిమంది దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు పెన్షన్
అందిస్తూ వారికి అండగా నిలుస్తోందని అన్నారు. 14 రకాల రోగ పీడితులు,
వైకల్యాలున్న 7,98,352 మందికి నెలకు రూ.255 కోట్లు పైగా పించన్లు
అందిస్తుందన్నారు. దివ్యాంగులకు రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా
అమలు చేస్తుందని ఆయన చెప్పారు. ప్రతినెల 1వ తేదీనే గ్రామ వార్డు సచివాలయ
వాలంటీర్ ద్వారా ప్రభుత్వం నేరుగా దివ్యాంగుని వద్దకే పెన్షన్
అందిస్తుందన్నారు. మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4000 మంది
వైకల్యంతో ఉన్నటువంటి దివ్యాంగులు కూడా వాలంటర్లుగా నియామకం చేసిందని గుర్తు
చేశారు. అలాగే 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని మన ప్రభుత్వం వచ్చాక అమలు
చేశామని ఆయన గుర్తు చేశారు.
మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు నాలుగు శాతం పెంచి ఉద్యోగ నియామకల్లో గాని
ఉద్యోగ ప్రమోషన్ లో గాని దివ్యాంగులకు అవకాశం కల్పించారని చెప్పారు.
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వారికి బలంగా
వినిపించాలని ఈ సమావేసంలో ఆయన కోరారు.ఏమైన సమస్యలు ఉంటే పార్టీ కేంద్ర
కార్యాలయంకి గానీ లేదా తన దృష్టికి గానీ తీసుకురావాలని చెప్పారు. దివ్యాంగుల
విభాగ కమిటి నియామకాలు త్వరగా పూర్తి చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. పార్టీ
దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు కిరణ్ రాజ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ విభాగ
జిల్లా అధ్యక్షులు, జోనల్ ఇంచార్జిలు పాల్గొన్నారు.
వినతులు స్వీకరణ
కేంద్ర పార్టీ కార్యలయంలో వరసగా మూడో రోజు బుధవారం కూడా విజయసాయిరెడ్డి
గ్రీవెన్స్ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల నుండి వినతులు
స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.