నెల్లూరు : ది నెల్లూరు జర్నలిస్టుల పరస్పర సహాయక సహకార గృహనిర్మాణ సంఘం
లిమిటెడ్ నెల్లూరు నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికలు ఆదివారం నగరంలోని ఎన్జీవో
హోం లో నిర్వహించారు. తొలుత ఎన్నికల అధికారి పోటీలో నిలబడే అభ్యర్థుల నుంచి
నామినేషన్ పత్రాలను స్వీకరించారు. మొత్తం 14 మంది అభ్యర్థులు నామినేషన్
వేశారు. అనంతరం ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాలు పరిశీలన జరపగా అందులో
ఇద్దరు సభ్యులు అయిన రత్న ప్రసాద్, నారాయణ తమ నామినేషన్లను విత్ డ్రా
చేసుకున్నారు. దీంతో ప్యానల్ కు సరిపడా 12 మంది అభ్యర్థులకు పోటీగా మరో
ప్యానల్ లేకపోవడంతో ఎన్నికల అధికారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
దీంతో నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటు అయినట్లు అయింది. ఇందులో అధ్యక్షుడిగా
వల్లూరు ప్రసాద్ కుమార్, కార్యదర్శిగా గట్టుపల్లి శివకుమార్, ఉపాధ్యక్షుడిగా
కుమార్ (దేవా), డైరెక్టర్లుగా వేల్పుల శేషాచలపతి, ఉడతా రామకృష్ణ, కొండా
సుబ్రహ్మణ్యం, కేశవులు రెడ్డి, శాఖమూరి శ్రీనివాసులు, ఎన్. కుమార్, పాశం
నరసింహారావు , ఎస్. వెంకటేశ్వరరావు, జమీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన
అభ్యర్థులందరిచే ఎన్నికల అధికారి ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయించారు.
సీనియర్ న్యాయవాది ఎం. సుందరయ్య ఎన్నికల అధికారిగా సహాయకులుగా
కెసీహర్షవర్ధనరెడ్డి, ఎం.హరీష్ వ్యవహరించారు.