దేవస్థానంలో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి
ఆదివారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా
ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి
అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా
ఆలయ కార్యనిర్వాహనాధికారి అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదములు అందజేశారు. ఈ
కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు నంబూరి రవి, దేవిశెట్టి బాలకృష్ణ
ఉన్నారు.
అమ్మవారికి పవిత్ర సారె సమర్పణ :ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు
దుర్గమ్మకు పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా బ్రాహ్మణ
ఫెడరేషన్ , కృష్ణ జిల్లా బ్రాహ్మణ సంఘం వారు అమ్మవారికి పవిత్ర సారె
సమర్పించారు. విజయవాడ నగర సెంట్రల్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్
వైస్-ఛైర్మన్ మల్లాది విష్ణు అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ
కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి
దర్శనము కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ
ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల
భ్రమరాంబ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేసినారు. అనంతరం
మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ
విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి, అందరికీ ఆశీర్వాదం అందచేశారు. ఈ
కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు నంబూరి రవి, ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్
ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జి.కామేశ్వర శర్మ
బృందం పాల్గొన్నారు.