ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకే వికేంద్రీకరణ
సత్యాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
తరతరాలుగా వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం దుష్టశక్తులతో పోరాడేందుకు
సిద్ధంగా ఉండాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయం వల్ల
భవిష్యత్‌లో వేర్పాటువాద ఉద్యమాలు రాకుండా ఉంటాయని స్పష్టం చేశారు. శ్రీబాగ్
ఒడంబడిక చేసుకుని 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం నగరంలోని లలిత
కళాపరిషత్ ఆవరణలో గల కల్లూరు సుబ్బారావు విహ్రం వద్ద అభివృద్ధి వికేంద్రీకరణ
సాధన జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి శ్రీబాగ్ ఒప్పందం ఓ దిక్సూచి
అన్నారు.
ఈ ఒప్పందం ఎందుకు జరిగింది? దాని ఆవశ్యకత, రాయలసీమకు ఏం కావాలో వివరించారు.
గతంలో మనమంతా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్లమని.. శ్రీకాకుళం నుంచి
కర్నూలు వరకు, ఇప్పటి కర్ణాటకలో ఉన్న బళ్లారి ప్రాంతాలు సైతం తమిళనాడు
రాష్ట్రంలో ఉండేవన్నారు. తమిళుల వివక్షకు గురవుతుండడంతో వారి నుంచి
వేరుపడాలన్న ఆలోచన వచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలంటే రాయలసీమ
వాసులను కలుపుకుని పోవాల్సిన పరిస్థితుల్లో కోస్తా నాయకులు, రాయలసీమ నేతలు
కలిసి కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్‌లో సమావేశమై చేసుకున్న
ఒప్పందమే శ్రీబాగ్ ఒడంబడిక అని తెలిపారు. కోస్తా నాయకులతో పాటు సీమవాసులైన
పప్పూరి రామాచార్యులు, కల్లూరు సుబ్బారావు, కడప కోటిరెడ్డి వంటి ప్రముఖులంతా
1937 నవంబర్ 16వ తేదీన ఒప్పందం చేసుకున్నారన్నారు.
శ్రీబాగ్ ఒప్పందం జరిగి 85 ఏళ్ల అవుతున్నా ఇప్పటికీ రాయలసీమకు సరైన న్యాయం
జరగలేదని చెప్పారు. నదీ జలాలు, రాజధాని, హైకోర్టు విషయంలో రాయలసీమకు అత్యధిక
ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీబాగ్ ఒప్పందంలో ఉందన్నారు. ఆ ఒప్పందం తర్వాత తెలుగు
వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేసి
అమరుడయ్యాక కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. మళ్లీ
1956లో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అప్పటి
నుంచి కూడా శ్రీబాగ్ ఒప్పందం విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని గుర్తు
చేశారు. 2014లో మరోసారి రాష్ట్ర విభజన జరిగిందన్నారు. విభజన తర్వాత టీడీపీ,
బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని, జనసేన మద్దతుగా ఉందన్నారు.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీబాగ్ ఒప్పందాన్ని పట్టించుకోకుండా రాజధాని,
హైకోర్టును అమరావతిలోనే పెట్టారన్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు నదీజలాల
విషయంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకున్న పరిస్థితి
లేదన్నారు.
వీటన్నింటినీ గమనించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక
వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అందులో భాగంగా పరిపాలన
రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును
చేయాలని ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి
చెందాలన్న ఏకైక లక్ష్యంతో జగన్ ముందుకు వెళ్తుంటే అనేక అడ్డంకులు
సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడిదారులకు, రియల్ ఎస్టేట్
వ్యాపారులకు ఎందుకు మద్దతిస్తారు?. ఎప్పుడూ త్యాగాలు మనమే చేయాలా? అని
ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి
చెందుతాయని, మరోసారి వేర్పాటువాదం రాకుండా ఉంటుందన్నారు. సీమ సమగ్రాభివృద్ధి
విషయంలో అడ్డుపడుతున్న దుష్టశక్తులపై అందరూ పోరాటానికి సిద్దమవ్వాలని
పిలుపునిచ్చారు. సత్యాగ్రహ దీక్షలో అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి
అధ్యక్షుడు కేవీ రమణ, ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ రామిరెడ్డి, ఎల్కేపీ
అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, జేఏసీ సభ్యుడు కేపీ కుమార్, పాణ్యం సుబ్రమణ్యం, కో
కన్వీనర్ హనుమన్న, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, కదలిక ఎడిటర్
ఇమాం, నగర మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం
విజయభాస్కర్‌రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, పలు ప్రజా
సంఘాల నేతలు, న్యాయవాదులు పాల్గొన్నారు.