సత్తెనపల్లి : రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర
ప్రభుత్వం వెంటనే స్పందించి నష్ట పరిహారాన్ని ఇవ్వాలని.. భారతీయ జనతా పార్టీ
(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో
సోము వీర్రాజు మాట్లాడుతూ అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం
తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా
దెబ్బతిన్న పంటల వివరాలను, వాటికి చెల్లించాల్సిన నష్టపరిహారాలకు సంబంధించి
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశానని సోము వీర్రాజు తెలిపారు. అనంతరం
దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించిందన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గతంతో
పోలిస్తే ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం పెరిగిందని ఆయన కొనియాడారు.