భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను
ఆకట్టుకుంటోంది జాన్వీకపూర్, ప్రస్తుతం తెలుగు తెరపై తన నటనను
ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది ఈ భామ. అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, జాన్వీకపూర్
జంటగా నటిస్తున్న చిత్రం దేవర, ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన తను ఓ ఇంటర్వ్యూలో తెలుగు చిత్రసీమపై ఆసక్తికర
వ్యాఖ్యలు చేసింది. ‘ఇప్పటివరకు ఈ సినిమా చిత్రీకరణలో మూడు రోజులే
పాల్గొన్నాను. మొదట్లో అందరూ హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ
నాతో చాలా ప్రేమగా ఉన్నారు. దాంతో కెమెరా ముందు స్వేచ్ఛగా నటించాను. వారందరితో
హాయిగా గడిపాను. వాళ్ల ప్రేమ చూస్తుంటే సొంతింటికి వచ్చినట్టుగానే
అనిపించింది’ అని చెప్పుకొ చ్చింది జాన్వీ.