పెను ప్రకృతి విపత్తుతో విలవిల్లాడిన తుర్కియే ప్రజలు భారత్ చేసిన మానవత
సాయాన్ని అభినందించారు. దారుణమైన పరిస్థితుల్లో భారత సైన్యం తమకు అండగా
నిలిచిందని ధన్యవాదాలు తెలిపారు. భూకంపంతో మౌలిక సదుపాయాలు దెబ్బతిని వైద్య
సేవలు కష్టతరమైన నేపథ్యంలో భారత్ తమను ఆదుకుందని కొనియాడారు. భారత ప్రజలను
దేవుడు చల్లగా చూడాలని మనసారా ఆశీర్వదించారు. పెను ప్రకృతి విపత్తుతో
విలవిల్లాడిన తుర్కియే ప్రజలు భారత్ చేసిన మానవత సాయాన్ని అభినందించారు.
దారుణమైన పరిస్థితుల్లో భారత సైన్యం తమకు అండగా నిలిచిందని ధన్యవాదాలు
తెలిపారు.భూకంపంతో మౌలిక సదుపాయాలు దెబ్బతిని వైద్య సేవలు కష్టతరమైన నేపథ్యంలో
భారత్ తమను ఆదుకుందని కొనియాడారు. భారత ప్రజలను దేవుడు చల్లగా చూడాలని మనసారా
ఆశీర్వదించారు. తుర్కియే, సిరియాల్లో భూకంపం వచ్చిన వెంటనే భారత్ ఆపన్న హస్తం
అందించింది. నూట ఒకమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు, ఆహారం, వైద్యసామాగ్రిని
యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయించి ప్రత్యేక విమానాల్లో పంపించింది.
తుర్కియే, సిరియాల్లో భూకంపం వచ్చిన వెంటనే భారత్ ఆపన్న హస్తం అందించింది.
నూట ఒకమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు, ఆహారం, వైద్యసామాగ్రిని యుద్ధ
ప్రాతిపదికన సిద్ధం చేయించి ప్రత్యేక విమానాల్లో పంపించింది. అత్యవసర వైద్య
సేవలకుగానూ భూకంప ప్రభావిత ప్రాంతాల్లోనే శిబిరాలను నిర్మించింది. ఆక్సిజన్
ప్లాంటులు, వెంటిలేటర్లను సమకూర్చింది. అత్యవసర వైద్య సేవలకుగానూ భూకంప
ప్రభావిత ప్రాంతాల్లోనే శిబిరాలను నిర్మించింది. ఆక్సిజన్ ప్లాంటులు,
వెంటిలేటర్లను సమకూర్చింది. ఆర్థోపెడిక్, జనరల్ వైద్యులతో ఎమర్జెన్సీ
వైద్యమందించింది. భారత్ చర్యల పట్ల ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఆర్థోపెడిక్, జనరల్ వైద్యులతో ఎమర్జెన్సీ వైద్యమందించింది. భారత్ చర్యల
పట్ల ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేశాయి. తుర్కియేకు సహాయం చేసేందుకు భారత్
నుంచి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తిరిగి స్వదేశానికి వచ్చారు. మూడు
బృందాలకు చెందిన 151 మంది జవానులు ఆదివారం భారత్ చేరుకున్నారు. ఈ క్రమంలో
పాకిస్థాన్ కూడా తుర్కియేకు సాయం చేస్తామంటూ వెళ్లింది. కానీ అక్కడ అది
నవ్వుల పాలైంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా తుర్కియేకు సాయం చేస్తామంటూ
వెళ్లింది. కానీ అక్కడ అది నవ్వుల పాలైంది. 2022 జూన్‌లో పాకిస్థాన్‌లో వరదలు
పోటెత్తినప్పుడు పాకిస్థాన్‌కు తుర్కియే మానవతా సాయం కింద వైద్య సామాగ్రి
వంటివి ఆ దేశానికి పంపింది. ఇప్పుడు అదే సామాగ్రిని పాకిస్థాన్ తిరిగి
తుర్కియేకు పంపింది. అది చూసి తుర్కియే అధికారులు కంగుతిన్నారు. తాము ఇచ్చిన
సామాగ్రినే మాకే పంపిస్తారా అంటూ తిరిగి మళ్లి వారికే పంపింది. దీంతో ప్రపంచ
దేశాల ముందు పాకిస్థాన్ పరువు పోయింది. తుర్కియేకు వారు పంపిన సాయాన్నే మళ్లీ
పంపి పాకిస్థాన్ నవ్వుల పాలైన మరుసటి రోజే తుర్కియే ప్రజలు భారత్‌ను
మెచ్చుకోవడం గమనార్హం.