విజయవాడ : దేశంలోనే ఎక్కడా లేనివిధంగా డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఎంతో
ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ
శాఖా మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో
నిర్మిస్తున్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను బుధవారం మంత్రి
మేరుగ నాగార్జున అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. తొలుత నమూనా
విగ్రహాలను పరిశీలించిన నిపుణులు, ఉన్నతాధికారులు వారి వారి అభిప్రాయాలను
సేకరించి, గురుగ్రామ్ లోని డిజైన్ నిపుణులకు పంపించగా చివరిగా ధ్రువీకరించిన
ఆకారాన్ని రూపొందించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా పాదాలకు సంబందించిన
బూట్లు తరలించడం జరిగింది. వాటిపై ఫాంట్ కు సంబందించిన విడి భాగాలను
వెల్డింగ్ ప్రక్రియలో జాయింట్ చేయడం జరుగుతుందన్నారు. షెడ్యూల్డ్ కులాల కోసం
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని వీటి ద్వారా ప్రతీ
ఒక్కరికీ లబ్ది చేకూరుస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్
మోహన్ రెడ్డి నిత్యం అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు
సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్
కు దేశంలో ఎక్కడ జరగని విధంగా ప్రజలందరూ గుర్తుంచుకునే విధంగా ప్రత్యక్షంగా
వీక్షించే రీతిలో విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్
విగ్రహ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు తెలిపారు.
స్వరాజ్య మైదానం ప్రాంగణంలో నిత్యం పర్యవేక్షణలో 24 గంటలు పాటు నిర్మాణ పనులు
వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక నిపుణులు వాసుదేవరావు మాట్లాడుతూ 80
అడుగుల పేడాస్టాల్ బేస్ మెంట్ నిర్మాణంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని
ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేడాస్టాల్ లోపల లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు
చేయనున్నట్లు తెలిపారు. భూమి నుండి విగ్రహం ఎత్తు మొత్తం 205 అడుగులు
ఉంటుందన్నారు. విగ్రహం చుట్టూ స్మృతి వనం నిర్మాణంతో పాటు సెంట్రల్
లైబ్రరరీ, కన్వెన్షన్ సెంటర్, ఎమ్యూజ్ మెంట్ పార్క్, 2 వేలమంది సామర్థ్యం
కలిగిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు 18 ఎకరాలు ప్రభుత్వ స్థలంలో రూ. 248
కోట్లతో బి.ఆర్. అంబేద్కర్ ప్రాజెక్టు పనులు చేపడుతున్నామన్నారు. ఈ పరిశీలనలో
మంత్రితో పాటు ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, అంబేద్కర్ సమాజ
సభ్యులు, అంబేద్కర్ వాదులు, అభిమానులు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘ నాయకులు
కనకాల రావు, బత్తుల వీరాస్వామి, జొన్నలగడ్డ శ్రీకాంత్, పి. ప్రకాష్, కోన
స్వర్ణ, కోన స్వప్న, తాటికొండ నరసింహారావు, బి. స్టాలిన్, ముత్తయ్య,
విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.