రోజుల జాతీయ సెమినార్ ను ప్రారంభించిన మంత్రిదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో జర్నలిస్ట్ ల సంక్షేమందేశంలో అత్యధిక అక్రిడిటేషన్ కార్డులు మన రాష్ట్రంలోనే ఇచ్చాం
హలాల్ గురించి, హిజాబ్ గురించి శాసించే అధికారం ప్రభుత్వాలకు ఎక్కడిది
తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్,
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ
మంత్రి కె. టి. రామారావు
హైదరాబాద్ : డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జర్నలిజం,మాస్
కమ్యూనికేషన్ డిపార్టుమెంటు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడెమీ ఆద్వర్యంలో
“తెలంగాణలో మీడియా : గతం, వర్తమానం మరియు భవిష్యత్తు” అనే అంశంపై రెండు రోజుల
జాతీయ సెమినార్ను తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్,
కమ్యూనికేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమలు,
వాణిజ్య శాఖ మంత్రి కె. టి. రామారావు ప్రారంభించారు. మంత్రి కె.టి.ఆర్
మాట్లాడుతూ వారసత్వం అనేది ఎంట్రీ కార్డ్ మాత్రమే తరవాత మన సమర్థతే మనల్ని
ప్రజల్లో నిలబెడుతుందని అన్నారు. సిరిసిల్లలో నాలుగు సార్లు తాను ఎన్నిక అయితే
ప్రతీసారీ పెరిగిన మెజారిటీయే దీనికి నిదర్శనం అన్నారు. నాకు రోజుకి 13 వార్తా
పత్రికలు చదవటం అలవాటు. ఒక్కో వార్త ఒక్కో రకంగా వస్తుంది, వాటిలో ఏధి
వాస్తవమో తెలుసుకోడానికి ఎక్కువ పత్రికలు చదవాల్సి వస్తుంది.
మీడియా సంస్థల కంటే కూడా మీడియాలో పని చేసే వారి ధైర్యం గొప్పది. నిజాం
కాలంలో షోయబుల్లాఖన్ గోల్కొండ పత్రిక ద్వార నిజాంను ప్రశ్నించారు. తెలుగు
పాత్రికేయ రంగంలో సురవరం ప్రతాపరెడ్డి లాంటి కలం వీరుల నైతిక బలం గొప్పది.
అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో, టిఆర్ఎస్ పార్టీ పెట్టిన సమయంలో మాకు డబ్బు
సపోర్ట్, మీడియా సపోర్ట్ లేదు కానీ మన తెలంగాణ ప్రాంత పాత్రికేయులు మేము
ఉన్నామని, ఉద్యమానికి మద్దతుగా దైర్యం ఇచ్చారు. అప్పుడు కేంద్రంలో ఎన్డీయే ,
రాష్ట్రంలో టిడిపి పార్టీలు ఉన్నాయి. మీడియా యాజమాన్యాలు మనవి కాదు అయినా
మీడియాలో ఉన్న తెలంగాణ జర్నలిస్తులే మాకు అండగా నిలబడ్డారు. అప్పుడు మాకు నీడగ
నిలిచిన చాలా మంది జర్నలిస్టులకు సముచిత స్థానం ఇచ్చి ప్రభుత్వ పరంగా
గౌరవించుకున్నం. 8 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ తప్ప మీడియాతో
మాట్లాడిన సందర్భం లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ హెలికాప్టర్
క్యాబిన్ తెలంగాణలో తయారవుతుంది, ఐటీలో మంచి కంపెనీలు హైద్రాబాద్ లో ఉన్నాయి
కానీ ఎవరు ఈ వార్త మనకు అనుకూలంగా రాయరు, మంచి చేసినప్పుడు ఎందుకు చూపించడం
లేదు, పాల, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ముందు స్థానంలో ఉంది, ఇవన్నీ వార్తలు
కావా? చాలా రంగాల్లో ముందు వరుసలో ఉన్నా మన గురించి మంచిని మంచిగా రాయరు.
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమంలో చెరువులను అభివృధ్హి చేసింది.
దీంతో చెరువులు నిండి వ్యవసాయానికి రైతులకు ఉపయోగకారిగా నిలుస్తున్నాయి,
కట్టలు తెగిపోకుండా గట్టిగ ఉండేలా చేశాం. ఇది వార్తగా రాయరు కానీ కట్ట తెగితే
మాత్రం వార్తలు రాస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్నా,
ద్రవ్యోల్బనం అతలాకుతలం చేస్తున్నా, దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నా వార్తలు
రావు, హలాల్ గురించి, హిజాబ్ గురించి మాట్లాడుతారు, శాసిస్తారు, ఏం తినాలి,
ఏం వేసుకోవాలి అనేవి చెప్పే అధికారం ప్రభుత్వాలకు ఎక్కడిది. ఇలాంటివి మీడియా
నిలదీయదు. అయితే జుమ్లా మాటలు, లేకపోతే హమ్ల అని కేంద్ర ప్రభుత్వాన్ని
ఉద్దేశించి ఘాటుగా మాట్లాడారు.
ఐటీ దాడుల భయం, దేశంలో మీడియా మోదియాగా మారిపోయింది అని మంత్రి కీటీయార్
పేర్కొన్నారు. పక్క దేశంలో అదానికి ఓ కాంట్రాక్ట్ ఇవ్వాలని ఒత్తిడి చేసీ మరి
మోడీ ఇప్పంచారని సాక్షాత్తు ఆ దేశ మంత్రి పేర్కొన్నా అలంటి వార్తలపైన మన దేశ
మీడియా పరిశోధన చేసి ఏది వాస్తవమో వార్తలు రాయదని, మోడీ అంటే మీడియా
యాజమాన్యాలకు అంత భయంగా ఉందని ప్రస్తావించారు. కార్యక్రమానికి విశిష్ట
అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడెమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ
మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనన్ని జర్నలిస్ట్ సంక్షేమ కార్యక్రమాలు ఒక్క
తెలంగాణలో మాత్రమే అమలు అవుతున్నాయని, దేశంలో అత్యధిక అక్రిడిటేషన్ కార్డులు
మన రాత్రంలోనే ఇచ్చామని వివరించారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డ
పాత్రికేయులను ఆదుకున్నామని, మరణించిన జర్నలిస్ట్ ల కుటుంభాలకు పెన్షన్
ఇస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.కే.సీతారామ
రావు మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయం అందిస్తున్న జర్నలి జం కోర్సు గురించి
ప్రస్తావిస్తూ ప్రతి సంవత్సరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో అభ్యసించే
పాత్రికేయులు వందల సంఖ్యలో ఉండడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా గౌరవ
అతిథిగా విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి దేశంలో మీడియా
పాత్ర, మీడియా సంస్థలు వ్యవహరిస్తున్న తీరును వివరించారు. విశ్వవిద్యాలయాల్లో
పనిచేస్తున్న అధ్యాపకులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని, అధ్యాపకుల
పదవీవిరమణ వయస్సును ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధంగా పెంచాలని మంత్రి
దృష్టికి తెచ్చారు. ఎస్ వెంకట్నారాయణ, అంతర్జాతీయ జర్నలిస్ట్, చైర్ ఎ ఫ్ సీసీ
అడ్వైజరీ కమిటీ, న్యూఢిల్లీ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
కీలకోపన్యాసం చేశారు. తెలంగాణలో మీడియా, గతం, వర్తమానం, భవిష్యత్ అనే అంశంపై
ఆయన కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ నుంచి 200 ల పత్రికలు వివిధ భాషల్లో
వెలువడుతున్నాయన్నారు. సుమారు 40కి పైగా టెలివిజన్ ఛానెల్స్ ఉన్నాయన్నారు.
దేశంలోని అన్ని భాషలు, మతాలు, కులాలు హైదరాబాద్ లో కనిపిస్తాయన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ ముందుకు వెళ్తోందని ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు
తెచ్చుకుంటోంది కితాబు ఇచ్చారు.