గుంటూరు : దేశంలో రైల్వే నెట్ వర్క్ స్థాయిని పెంచుతున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గుంటూరు నుంచి శుక్రవారం మూడు రైళ్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గుంటూరు – విశాఖ, నర్సాపూర్ – హుబ్లీ, రేణిగుంట – కడప రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు నుంచి వైజాగ్ వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రైల్వే విద్యుదీకరణ కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో అన్ని లైన్లను విద్యుదీకరణ చేశామని చెప్పారు. 371 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని ఏపీలో నిర్మించామన్నారు. వచ్చే పదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్ రైల్వే నెట్ వర్క్‌గా ఎదగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాంమన్నారు. రైల్వేకు నిధుల కొరత లేకుండా చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.