కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్..జన్ దన్ యోజన కింద దేశంలో 50 కోట్ల మందికి జీరో అకౌంట్లను చేయించిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దని వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఎస్. ఎస్. ఆర్ నాయుడు చెప్పారు. కలువాయి లోని బి.వి.ఎన్.ఆర్ జడ్పీ హై స్కూల్ “వికసిత్ భారత్ సంకల్పయాత్ర ” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్ ఎస్ ఆర్ నాయుడు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎస్ ఎస్ ఆర్ నాయుడు మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలో మహిళలు ఆర్ధికంగా ఎదగాలని బ్యాంక్ ల్లో జీరో అకౌంట్ లు నమోదు చేయించారని, తద్వారా ప్రపంచంలోనే అత్యధికం గా అకౌంట్లు, ఎక్కువ డిపాజిట్లు కలిగిన దేశం భారత దేశమని తెలిపారు.ముద్ర లోన్లు ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సబ్సిడీతో రుణాలు ఇస్తున్నారని చెప్పారు. ఈ సొమ్ము ద్వారా ప్రజల మేకలు, గొర్రెలు, నాటు కోళ్లు, పందులు పెంచుకొని ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన, విశ్వకర్మ యోజన, కిసాన్ సమ్మన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన ఇలా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, వాటి ప్రయోజనాల గురించి, సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా అధికారులు చూసుకోవాలని, అర్హులైన వారందరికీ పధకాలు అందేలా చేయాల్సి న భాద్యత అధికారుల పై ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులను, ఉజ్వల పథకం కింద వచ్చినటువంటి HP గ్యాస్ కనెక్షన్లను,నరేంద్ర మోడీ గారి క్యాలెండర్లు, నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన కరపత్రములు, అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్. ఎస్. ఆర్ నాయుడుతో పాటు, వివిధ డిపార్ట్మెం