గుంటూరు : రాష్ట్ర సహకార రంగాన్ని వైసీపీ ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా
మార్చుకుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం
మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి వైసీపీ కార్యకర్త నుంచి
ముఖ్యమంత్రి వరకు సహకార రంగంలో రూ.5వేలకోట్ల దోపిడీ జరిగిందన్నారు. దీనిపై
దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్ షాకు, నాబార్డ్
ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇసుక దోపిడీలో నియమించినట్టే,
సహకారరంగంలో త్రిసభ్య కమిటీల పేరుతో పాలెగాళ్లను నియమించి, అధికారుల సాయంతో
అధికారపార్టీ నేతలు రైతుల సొమ్ముని దోచేస్తున్నారపి ఆరోపించారు. సహకార రంగంలో
జరిగిన దోపిడీకి సంబంధించి తమ దృష్టికి వచ్చిన వివరాలు చాలా తక్కువని, బయటకు
రావాల్సినవి ఇంకా ఉన్నాయని అన్నారు. ఏలూరు జిల్లా టీ.నరసాపురం, చింతలపూడి,
కామవరపుకోట, రంగాపురం, సరిపల్లిసహా, పలుసొసైటీల్లో దగ్గర దగ్గర రూ. 400కోట్ల
అవినీతి జరిగిందన్నారు. ఏలూరు సెంట్రల్ బ్యాంక్‌లో రూ.17 కోట్లు
అన్యాక్రాంతమయ్యాయన్నారు. ఇటీవల గుంటూరు సెంట్రల్ బ్యాంక్‌లో డ్వాక్రా మహిళల
పేర్లు మార్చి రూ.500కోట్ల వరకు కాజేశారన్నారు. కృష్ణాజిల్లా పెడనలో ఒక మహిళ
పేరుతో ఉన్న 1.80 ఎకరాల భూమిని తనఖా పెట్టి, ఆమెకే తెలియకుండా రుణం
తీసుకున్నారన్నారు. విశాఖపట్నం సెంట్రల్ బ్యాంక్‌లో కోటి రూపాయాలు, వినుకొండలో
రూ.2 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి సహకార సంఘంలో రూ.23కోట్లు,
కాకినాడ జయలక్ష్మి సహకార బ్యాంకులో రూ.560 కోట్లు కాజేశారని ఆయన తెలిపారు. ఇలా
చెప్పుకుంటూ పోతే సహకారరంగంలో వైసీపీ నేతలు, అధికారులతో కుమ్మక్కై చేసిన
దోపిడీ చాలానే ఉందన్నారు. తాను గతంలో విశాఖపట్నం ఇన్‌ఛార్జ్‌గా మంత్రిగా
ఉన్నప్పుడు నగరంలోకి ప్రవేశించిన సంఘ విద్రోహశక్తుల్ని ఎన్కౌంటర్
చేయించినట్లు తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన కిడ్నాప్‌ను డీజీపీ తేలికచేసి
మాట్లాడుతూ, రాష్ట్రమంతా బాగుందని చెప్పడం ఎంతమాత్రం సరైందికాదన్నారు. వైసీపీ
నేతలు, కార్యకర్తల విధినిర్వహణే తమ గురుతరబాధ్యత అన్నట్టుగా పోలీస్ వ్వవస్థ
అధికారపార్టీకి కంచెలా కాపలాకాస్తోందని మండిపడ్డారు. పదోతరగతి విద్యార్థిని
పెట్రోల్ పోసి తగలబెట్టడం వైసీపీ నేతల దుర్మార్గానికి నిదర్శనం కాదా? అని
ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వారే దోచుకోగాలేనిది, తాము దోచుకుంటే
తప్పేమిటన్న ధీమాతోనే రాష్ట్ర వ్యాప్తంగా సంఘవిద్రోహశక్తులు
పేట్రేగిపోతున్నాయని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.