తమిళ అగ్ర హీరో విజయ్ ప్రస్తుతం ‘లియో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. లోకేష్
కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్యాంగ్ స్టార్ డ్రామాగా
తెరకెక్కుతున్నది. అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ
సినిమా షూటింగ్ ముగిసిన అనంతరం వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రంలో
నటించబోతున్నారు. ఆయన నటిస్తున్న 68వ చిత్రమిది. ఈ సినిమా గురించి ఓ
ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. ఇందులో విజయ్ అన్నాదమ్ములుగా
ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని తెలిసింది. రెండు భిన్న కోణాల్లో ఈ పాత్రలు
సాగుతాయని చెబుతున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి స్వరకర్త. మాస్
యాక్షన్ ఎంటర్ టైనర్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని
తెరకెక్కించబోతున్నారు.