విద్యార్థుల ఉజ్వల భవిత కోసం వైఎస్ జగనే మళ్లీ సీఎం కావాలి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్విట్జర్లాండ్ దేశపు ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారేట్) తో ఒప్పందం కుదుర్చుకుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆదివారం పలు అంశాలు వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐబీ కరిక్యులం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. విద్యార్దుల ఉజ్వల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకోవాలని కోరారు.
వైఎస్ఆర్సీపీ పొత్తు ప్రజలతోనే : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు కేవలం ప్రజలతోనే అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు మార్లు ఉద్ఘటించారని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం రూపొందించిన అనేక సంక్షేమ పథకాల ఫలితంగా పేదరికం నుంచి లబ్దిదారులు బయటపడ్డారని అన్నారు. అనేక సంక్షేమ పథకాల కింద రాష్ట్రంలో రూ. 2.55 లక్షల కోట్లు పంపిణీ చేశారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుంపులుగా మారడం పెద్ద విశేషం కాదని ఒంటిరిగా పోటీలో దిగాలంటే ధైర్యం కావాలని, ప్రజలు అందించిన ధైర్యంతోనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నారని అన్నారు. తోడేళ్ల గుంపుకు ఒంటిరిగా ఎదిరించే సింహంలా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్దమయ్యారని అన్నారు.
124 సార్లు బటన్ నొక్కిన సంక్షేమ రారాజు సీఎం జగన్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తాను పరిపాలించిన 57 నెలల కాలంలో 124 సార్లు బటన్ నొక్కి సంక్షేమ ఫలాలు నేరుగా లబ్దిదారులకు అందించారని అన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి కొనసాగాలంటే అందుకు ప్రతిఫలంగా ప్రజలు కేవలం రెండు సార్లు బటన్ నొక్కితే చాలని, ఒకటి అసెంబ్లీ ఎన్నికల కోసం, మరొకటి పార్లమెంట్ ఎన్నికల కోసమని విజయసాయి రెడ్డి అన్నారు.