తెలుగులో ఓ సరికొత్త మల్టీస్టారర్ చిత్రం కోసం చర్చలు మొదలయ్యాయి. అంతా
అనుకున్నట్టు సాగితే అందులో నాగార్జున – ధనుష్ కలిసి నటించే అవకాశాలున్నాయి. ఈ
కలయికలో ఇదివరకే ఓ సినిమా రూపొందాల్సివుండగా, అది కార్యరూపం దాల్చలేదు.
అనూహ్యంగా మరోసారి ఈ కలయిక తెరపైకి వచ్చింది. అయితే ఈసారి శేఖర్ కమ్ముల ఈ
కలయికలో సినిమా రూపొందించనున్నారు. ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల
దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ఏషియన్ సంస్థ
అధినేత సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోనే నాగార్జున
ఓ కీలక పాత్రని పోషిస్తారని, ఇదొక మల్టీస్టారర్ సినిమాగా రూపుదిద్దుకునే
అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలలో వినికిడి. ప్రస్తుతం అందుకు సంబంధించిన
కథాచర్చలు కొనసాగుతున్నాయి తెలిసింది. ఈసారి అయిన ఏ క్రేజీ కాంబినేషన్ లో
మల్టీ స్టారర్ సినిమా పట్టలెక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.