భేరి కార్యాచరణ పోస్టర్ ఆవిష్కరణ
ప్రభుత్వం స్పందించకపోతే 5న భవిష్యత్ కార్యాచరణ
విజయవాడ : అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్ భారాలతో దోచుకుతింటున్న కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 30వ తేదీ నుండి రాష్ట్ర
వ్యాప్తంగా సమరభేరి పేరుతో ఆందోళన చేపట్టనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
వి.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విజయవాడ బాలోత్సవ భవన్లో నిర్వహించిన
విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సీతారాం,
వి.వెంకటేశ్వర్లు, కె.సుబ్బరావమ్మతో కలిసి సమరభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారాలకు వ్యతిరేకంగా 30వ తేదీ నుండి
సెప్టెంబరు నాలుగోతేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని,
30,31 తేదీలలో ప్రచారం, సంతకాల సేకరణ, ఒకటోతేదీన సచివాలయాల్లో అర్జీలు
సమర్పిస్తామని, నాలుగోతేదీన అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామని
పేర్కొన్నారు. అప్పట్లోపు ప్రభుత్వం స్పందించకపోతే 5వ తేదీన పార్టీ రాష్ట్ర
కమిటీ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
కేంద్రం విధిస్తున్న షరతులకు తలొగ్గి రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు భారాలు
మోపుతోందని తెలిపారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని, విద్యుత్
భారాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని తెలిపారు. ప్రపంచ బ్యాంకు షరతులను
కేంద్రం అమలు చేస్తూ రాష్ట్రాలపైనా రుద్దుతోందని అన్నారు. రాష్ట్రం కూడా
అప్పుల కోసం కేంద్రం విధించిన షరతులన్నీ అమలు చేస్తోందని, దీనివల్ల సామాన్య
ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల
విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని, గతంలో రూ.200 బిల్లు
వస్తే ఇప్పుడు రూ.400 వస్తోందని, అంటే బిల్లు 100 శాత్లం పెరిగిందని ఇంత
పెద్దఎత్తున భారాలు పడుతుండటంతో పరిశ్రమలు కూడా మూతబడుతున్నాయని పేర్కొన్నారు.
ఇవి చాలదన్నట్లు వ్యవసాయ మోటార్లకు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు
సిద్ధమయ్యారని విమర్శించారు. అదే జరిగితే విద్యుత్ వాడకం గగనమేనని తెలిపారు.
ట్రూఅప్, ఫ్యూయల్ సర్‌ఛార్జి పేరుతో ఎప్పుడో వాడుకున్న విద్యుత్‌కు ఇప్పుడు
భారాలు వేస్తున్నారని, అద్దె ఇళ్లలో ఉండే సామాన్యులకు ఇది పెనుభారమని
తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా
విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారని, ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి
కూడా దీక్షలు చేశారని తెలిపారు. అధికారంలోకి రాగానే తన సొంత కంపెనీలకే వాటాలు
కట్టబెడుతూ దోచుకుంటున్నారని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లను అదానీ అనుబంధ
కంపెనీల నుండి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. జగన్మోహన్రెడ్డికి ప్రజలపై
ప్రేమ ఉంటే ట్రూఅప్, సర్ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు విద్యుత్ అమర వీరుల
దినోత్సవమైన ఆగస్టు 28న ప్రకటించాలని డిమాండు చేశారు. భారాలపై ప్రజల
ఆగ్రహానికి గురికాకముందే కేంద్రం విధిస్తున్న షరతులను తిరస్కరిస్తున్నట్లు
ప్రకటించాలని డిమాండు చేశారు.
భారత్‌మాల పేరుతో అదానీ భూదోపిడీ విచారణకు డిమాండ్
భారత్‌మాల పేరుతో జాతీయ రహదారులు నిర్మాణానికి ప్రభుత్వాలు లక్షల ఎకరాలు
సేకరించి వాటిని అదాని కంపెనీలకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని
ప్రోత్సహిస్తున్నారని శ్రీనివాసరావు విమర్శించారు. కానీ భూములిచ్చిన రైతులకకు
తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. భారత్‌మాల పేరుతో జాతీయ సంపదను
దోచిపెడుతున్నారని కాగ్ కూడా వేలెత్తి చూపిందన్నారు. రూ.10 లక్షల కోట్లతో
రెండు దశల్లో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని
అన్నారు. మొదటిదశలో రూ.6.5 లక్షల కోట్లతో చేపడుతున్న పనుల్లో రాష్ట్రంలో వేల
ఎకరాలు తీసుకుంటున్నారని, దీనిలో విజయనగరం జిల్లాలో 1500 ఎకరాలు, నెల్లూరు
జిల్లాలో 1000 ఎకరాలు ఇలా అవసరానికి మించి తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
వీటన్నిటినీ అదానీ చేతుల్లో పెడుతున్నారని అన్నారు. జాతి సంపదను కార్పొరేట్ల
చేతుల్లో పెట్టే కేంద్ర విధానాలు తిప్పికొట్టాలని అన్నారు. అలాగే
చెన్నై`విశాఖపట్నం`బెంగుళూరు`ముంబయి పారిశ్రామిక కారిడార్‌లోనూ లక్షల ఎకరాలు
తీసుకుంటున్నారని అన్నారు. ఎకరాకు రూ.1.40 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.20
లక్షల నుండి రూ.25 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, అధికారులు కూడా దీనిలో
భాగస్వామ్యమై రైతులను బెదిరిస్తున్నారని అన్నారు. నిరాకరిస్తున్న వారి భూములను
బలవంతంగా లాగేసుకుంటున్నారని తెలిపారు. వాస్తవంగా భూములు సేకరిస్తే వాటిపై
అధారపడిన కూలీలకూ పరిహారం చెల్లించాలని, అయినా ప్రభుత్వాలు వారిని
నిర్లక్ష్యంగా వదిలేశాయని తెలిపారు. దీనిపై కేంద్రం స్పందించి జాయింట్
పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండు చేశారు. అభివృద్ధి అనే పేరుతో
అడ్డగోలుగా కార్పొరేట్ సంస్థలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కట్టబెడుతున్నా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజానీకమంతా వ్యతిరేకించాలని విజ్ఞప్తి
చేశారు.