కుప్పంలో ఈ నెల27 న గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న అక్కడి ఆసుపత్రిలో
చేరిన విషయం తెలిసిందే. కుప్పం ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స
చేశారు.ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి
తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తారకరత్నను బెంగళూరులోని నారాయణ
హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రికి చేరుకునే సమయానికే అతని ఆరోగ్య
పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కార్డియోజెనిక్ షాక్
కారణంగా అతని పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం
కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ-డిసిప్లినరీ క్లినికల్ టీమ్
తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.
కాగా, తారక రత్నను చూసేందుకు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్,
కల్యాణ్ రామ్, నారా బ్రాహ్మిణి బెంగళూరుకు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్
బెంగళూరుకు వస్తున్నారని తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ
మంత్రిని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి పంపించారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో
వచ్చిన వీరిని ఆరోగ్య మంత్రి ఎయిర్ పోర్టులోనే కలిశారు. జూనియర్ ఎన్టీఆర్,
కల్యాణ్‌రామ్, ఇతర కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి
చేరుకున్నారు. వీరితో పాటే టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య నారా
బ్రాహ్మణి కూడా ఆస్పత్రికి వచ్చారు.
ముందుగా తారకరత్నను చూసిన కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి
వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని
వైద్యులు వారికి తెలిపారు. అవసరమైతే విదేశాల నుంచి ఎక్స్‌పర్ట్స్‌ను
పిలిపించాలని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా కుటుంబ సభ్యులంతా కోరినట్లు
తెలుస్తోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితులపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి
సుధాకరన్ కూడా ఆరా తీశారు. నారాయణ హృదయాలకు వచ్చి వైద్యులతో మాట్లాడారు.
కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం తెలియజేయాలని ముఖ్యమంత్రి బొమ్మై.. ఆ మంత్రిని
ఆదేశించినట్లు సమాచారం. అనంతరం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కూడా మంత్రి
మాట్లాడారు.