యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మంచి కొవ్వులు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. వీటిని
తినడం వల్ల ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..
* బాదం:
బాదంలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో
కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని తరచుగా తింటే ఆకలి తగ్గుతుంది. దీంతో బరువు
తగ్గడానికి అవకాశం ఉంటుంది. బాదం పప్పులను పచ్చిగా లేదా ఫ్రై చేసుకొని
తినవచ్చు. అయితే వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున తింటే శరీరానికి
కావాల్సిన పోషకాలు అందుతాయి.
* వాల్ నట్స్:
వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.
దీంతో శరీరంలో జరిగే ఆక్సిడేషన్ స్ట్రెస్తో పోరాడటానికి అవసరమైన శక్తిని ఇవి
అందిస్తాయి. జీర్ణక్రియను సైతం వాల్ నట్స్ మెరుగుపరుస్తాయి. ఇవి మెదడు
ఆరోగ్యాన్ని కాపాడుతూ అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని
తగ్గిస్తాయి. వాల్ నట్స్ ని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తినడం వల్ల అనేక
ప్రయోజానాలు ఉన్నాయి.
* జీడిపప్పు:
జీడిపప్పు మంచి పోషక విలువలున్న నట్, వీటిలో మంచి కొవ్వు, ప్రోటీన్, మాంగనీస్,
జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. జీడిపప్పులో స్టెరిక్
యాసిడ్ ఉంటుంది. డైట్లో వీటిని చేర్చుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
* పీనట్:
సాధారణంగా నట్స్ ఖరీదైనవి. అయితే వీటిలో పీనట్స్ మాత్రం తక్కువ ధరకే
లభిస్తాయి. మంచి కొవ్వు, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, వివిధ రకాల విటమిన్స్,
ఖనిజాలకు పీనట్స్ పవర్ హౌస్. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ రెస్వెరాట్రాల్ ఉంటుంది.
ఇది శరీరంలో ఎనర్జీ స్థాయిలను పెంచుతుంది. పీనట్స్ లో మోనో అన్ శాచురేటెడ్,
పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే క్యాన్సర్లు, అల్జీమర్స్ వంటి
వ్యాధులతో పోరాడే శక్తి వీటికి ఉంటుంది. పీనట్స్ ను రాత్రి నానబెట్టి
మొలకెత్తిన తరువాత తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.
* పిస్తా:
పిస్తాపప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటి
ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడంతో గుండె ఆరోగ్యంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
పిస్తాల్లో ఫైబర్స్, ఖనిజాలు తగిన మోతాదులో ఉంటాయి. దీంతో రక్తంలో చక్కెర,
కొలెస్ట్రాల్ లెవల్స్ ను నియంత్రిస్తాయి. రక్తపోటు అదుపులో ఉంచుతుంది.