పూర్తయ్యాయని జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు.
రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు
మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ మరో 24 లింకు ప్రాజెక్ట్‌లకు సంబంధించి
ఫీజిబిలిటీ (సాధ్యాసాధ్యాల) నివేదికలు కూడా పూర్తయినట్లు చెప్పారు. ప్రభుత్వ
నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ కింద నదుల అనుసంధానం కోసం జాతీయ జలాభివృద్ధి
సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) దేశ వ్యాప్తంగా 30 లింకులను గుర్తించింది. ఈ
లింకులన్నింటికీ ప్రీ ఫీజిబిలిటీ నివేదికలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.
నదుల అనుసంధాన ప్రాజెక్ట్ అమలు కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం
భరించాల్సి ఉంటుందని ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని మంత్రి చెప్పారు. నదుల
అనుసంధానం ప్రాజెక్ట్ అమలు దశలో మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం, నిధుల
సమీకరణ వంటి తదితర అంశాలు చర్చకు వస్తాయని పేర్కొన్నారు.
2026 నాటికి పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టులో భాగంగా 5338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960
మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేయాలని
లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీజెన్కో తెలిపిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి
గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన
ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఏపీజెన్కో (ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్
కార్పొరేషన్) ఆధ్వర్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు
జరుగుతున్నట్లు వివరించారు. ఏపీజెన్కో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు
పవర్ హౌస్ పునాది నిర్మాణం కోసం తవ్వకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత నిధులతోనే అమలు
చేస్తోందని కేంద్ర ప్రభుత్వం అందుకు నిధులేమీ కేటాయించడం లేదని మంత్రి
తెలిపారు.