విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి
తీసుకుని వెళతామని మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది.
రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము
వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ
సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ మహిళా
సాధికారత, వివిధ రంగాల్లో మహిళల అభ్యున్నతి కొరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం
కల్పిస్తున్న అవకాశాలు , ప్రాధాన్యతను వివరించారు. సమావేశానికి మహిళా మోర్చా
రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి
భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ
పాలనలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలన్నారు.