విశాఖపట్నం : ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు టీడీపీ సీనియర్ నేత
అయ్యన్నపాత్రుడిపై మండిపడ్డారు. అయ్యన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ
అయ్యన్న పాత్రుడికేమైనా పిచ్చెక్కిందా? అని ప్రశ్నించారు. “ఎందుకలా
ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడు… అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో
పెట్టుకోవాలి. నర్సీపట్నంలో గెలవలేనని తెలిసి సైకోలాగా మాట్లాడుతున్నాడు” అంటూ
ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిగిపోయినట్టు, తాను మంత్రి అయిపోయినట్టు అయ్యన్న
భావిస్తున్నారని, పోలీసులను హింసిస్తానని అంటున్నారని విమర్శించారు. ఇక
రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేస్తామన్న తమ హామీపైనా ముత్యాలనాయుడు
స్పందించారు. ఒకేసారి మద్యనిషేధం చేస్తామని తాము చెప్పలేదని, దశలవారీగా
మద్యనిషేధం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మద్య నిషేధం అంచెలంచెలుగా ఉంటుందని
వివరించారు. రాష్ట్రంలో కొత్త బార్లకు అనుమతి ఇచ్చినంత మాత్రాన వాటి సంఖ్య
పెరిగినట్టు కాదని ముత్యాలనాయుడు అన్నారు. చాలావరకు నియంత్రించిన పిదపే కొత్త
బార్లకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. 2024లో ఏం చేస్తామన్నది ప్రజలే
చూస్తారని పేర్కొన్నారు.