దేవి
సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి
(కరోనా-19) డాక్టర్ మంజుల డి.హోస్ మని ని కలిసిన మంజుల దేవి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డి.
మంజుల దేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి
(కరోనా-19) డాక్టర్ మంజుల డి.హోస్ మని నియమితులైన సందర్భంగా వెలగపూడి
సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంజుల దేవి మాట్లాడుతూ
గతంలో ఒరిస్సా రాష్ట్రంలో కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా వ్యవహరించారని, వీరు
క్లిష్టమైన సమస్యలు పట్ల కీలకంగా వ్యవహరించి అత్యంత చాకచక్యంగా ఆ సమస్యలకు
ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు చేసిన విషయం చదివాను, విన్నానని, అటువంటి మేడం
ఒక డాక్టర్ గా మా నర్సుల యొక్క సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. వీరిని
ప్రభుత్వం ఈ డిపార్ట్మెంట్ కి అధికారిగా నియమించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ
సందర్భంగా వారికి నర్సులు యొక్క ముఖ్య సమస్యలు వివరించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ముగ్గురు స్టాఫ్ నర్స్ ల వల్ల పని ఒత్తిడి
ఎక్కువగా ఉందని నాలుగో స్టాఫ్ నర్స్ నియమించాలని కోరారు. స్టాఫ్ నర్స్ నుండి
నర్సింగ్ ఆఫీసర్స్ గా పదోన్నతి జీవో ని ఇంప్లిమెంట్ చేయాలని కోరారు. కొన్ని
ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నైట్ డ్యూటీ లో ఒక్క స్టాప్ నర్స్
మాత్రమే వర్క్ చేయటం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఒక వాచ్మెన్ ని యమిస్తే బాగుంటదని
అనేక సార్లు కోరడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య శాలల్లో
పేషంట్ల సెన్సెస్ పెరిగిందని, హెడ్ నర్సెస్ పోస్టులు కూడా ఇంక్రీజ్ చేయాలని
కోరారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ ఎన్నికలు జరిపేందుకు
ప్రభుత్వం అనుమతినిచ్చిందని, తేదీ నిర్ణయించి ఎన్నికలు జరిపించాలని కోరారు.
కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్స్ వేరే కేడర్ వాళ్లు
స్టాఫ్ నర్స్ ని వేదింపులకు కి గురి చేస్తూ, కించపరుస్తూ, అవమానిస్తూ
ఉన్నారని అట్టి పరిస్థితుల్లో ఉన్నచోట నిఘా పెట్టి, దీని మీద చర్యలు
తీసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. అన్ని సమస్యలు పూర్తిగా వివరించానని ఒక
డాక్టర్ గా, ఒక మహిళగా, ఆమె సానుకూలంగా స్పందించారని అన్నారు. త్వరలో అన్ని
సమస్యలు తీరతాయని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర
అధ్యక్షురాలు డి మంజుల దేవి వ్యక్తం చేశారు.