శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి
వస్తుందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండానే
ఎగురుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై మీడియాతో మాట్లాడిన
గుత్తా ఈ ఉత్సవాల్లో 21 రోజులు తొమ్మిదేళ్లలో తెలంగాణ సర్కార్ సాధించిన
ప్రగతిని ప్రజలకు తెలియజేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.