ఇంటికి వెళ్లి ఆశీస్సులు అందించిన చంద్రబాబు
హైదరాబాద్ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఇంట
మూడు రోజుల కిందట శుభకార్యం జరిగింది. కిశోర్ కుమార్ రెడ్డి కుమార్తె వైష్ణవి
రెడ్డి వివాహం దినేశ్ రెడ్డితో జరిగింది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత
చంద్రబాబు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. నూతన వధూవరులు
వైష్ణవి రెడ్డి, దినేశ్ రెడ్డిలకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు
తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందజేశారు. అనంతరం కిశోర్ కుమార్ రెడ్డి
కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.