తిరుమల : మహారాష్ట్రలోని నవీ ముంబయిలో బుధవారం శ్రీవారి ఆలయానికి భూమి పూజ
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్షిందే, డిప్యూటీ సీఎం
దేవేంద్ర ఫడణవీస్, రేమాండ్స్ అధినేత సింఘానియా, టీటీడీ ఛైర్మన్ వైవీ
సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏక్నాథ్
షిందే మాట్లాడుతూ తిరుమల తరహాలో నవీ ముంబయిలో శ్రీవారి ఆలయాన్ని
నిర్మించేందుకు టీటీడీ ముందుకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆలయ
నిర్మాణంతో ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత ముందుకు వెళ్తుందని భావిస్తున్నట్లు
చెప్పారు. టీటీడీ ఆలయ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. తిరుమలకు
వెళ్లి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు ఈ ఆలయంలో దర్శన భాగ్యం
కలుగుతుందని చెప్పారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆలయ
నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించిందన్నారు.
రెండేళ్లలో తిరుమల ఆలయం తరహాలోనే ఇక్కడా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని
చెప్పారు.