విజయవాడ : తొమ్మది సంవత్సరాల కాలంలో తొమ్మిది ప్రశ్నలు అంటూ విలేకరుల
సమావేశంలో బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ
తొమ్మితి ప్రశ్నలకు జవాబు చెప్పాలని పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ కుమార్
రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో
శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నవ సాల్, నవ సవాల్ అనే పుస్తకాన్ని
బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం
ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రపతి
అంటే రాజ్యాంగ ప్రకారం రాజ్యసభ, లోక్ సభ, పార్లమెంట్ అని అన్నారు. పార్లమెంట్
నూతన భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా జరగవలసిన ప్రారంభోత్సవాన్ని ప్రధాన
మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం చరిత్రలో ఎక్కడ కూడా కనివిని యెరుగమని
బీజేపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఏఐసీసీ ఆదేశాల ప్రకారం దేశంలోని అన్ని
నగరాలలోను ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ
విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు నరహరిశెట్టి నరసింహారావు, లామ్ తాంతియా కుమారి,
మేడా సురేష్, కాజా మొహిద్దీన్, బొర్ర కిరణ్ కుమార్, వి. గురునాథం, కొలనుకొండ
శివాజీ, కిరణ్, ఏసుదాసు, బైపూడి నాగేశ్వరరావు, వేముల శ్రీనివాస్, తూమాటి బాలు,
షేక్ నాగూర్, ప్రకాశ్, జోసఫ్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.